BJP: కమలం నేతల మధ్య ఏర్పడిన గ్యాప్.. కన్ఫ్యూజన్‌లో క్యాడర్..!

ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లుగా మారింది ఆ నియోజకవర్గ పరిధిలోని కమల దళం పరిస్థితి..! ఉన్న కొద్దీ మంది నేతల మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ వల్ల కార్యకర్తలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఎన్నికల ముందు వరకు మంచి ఊపులో ఉన్న నేతలు ఒక్కసారిగా డీలాపడ్డారు.

BJP: కమలం నేతల మధ్య ఏర్పడిన గ్యాప్.. కన్ఫ్యూజన్‌లో క్యాడర్..!
Bjp
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 07, 2024 | 4:56 PM

ఎవరికి వారే, యమునా తీరే అన్నట్లుగా మారింది ఆ నియోజకవర్గ పరిధిలోని కమల దళం పరిస్థితి..! ఉన్న కొద్దీ మంది నేతల మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ వల్ల కార్యకర్తలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఎన్నికల ముందు వరకు మంచి ఊపులో ఉన్న నేతలు ఒక్కసారిగా డీలాపడ్డారు.

ఉంటే ఉగాది, లేకుంటే శివరాత్రి అన్నట్లుగా మారిందట నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ పరిస్థితి. గతంలో లీడర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ.. ఎమ్మెల్యే ఎన్నికల ముందు పార్టీలోకి కొంత మంది నేతలు వచ్చి చేరడంతో, నియోజకవర్గ పరిధిలో బీజేపీ గాడిలో పడింది అని పార్టీ క్యాడర్ హ్యపీగా ఫీల్ అయ్యారట. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదట. ఎమ్మెల్యే ఎన్నికలు దగ్గర పడగానే పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు అయిపోయిన కూడా, నేతల మధ్య వర్గపోరు మాత్రం అసలు తగ్గడం లేదట.

ఎమ్మెల్యే ఎన్నికల్లో నర్సాపూర్ బీజేపీలో మొదలైన లొల్లి అసలు తగ్గడం లేదట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ యాదవ్ కి, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్దాసు మల్లేశం గౌడ్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే, భగ్గుమనే పరిస్థితి నెలకొందట. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మురళీ యాదవ్ ఎమ్మెల్యే ఎన్నికల ముందు బీజేపీలో చేరాడు. పార్టీలో చేరగానే బీజేపీ పార్టీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కష్టపడ్డ మమ్మల్ని కాదని, ఎమ్మెల్యే టికెట్ మురళీ యాదవ్ కి ఎలా ఇస్తారని, నియోజకవర్గానికి చెందిన నేతలు వాల్దాసు మల్లేశం గౌడ్, రఘువీరారెడ్డితో పాటు మరి కొంతమంది సీనియర్ నేతలు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కూడా చాలా సార్లు నిరసన తెలుపగా, చివరికి పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పుడు ఆ ఇష్యూ సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన మురళీ యాదవ్ ఓటమి పాలయ్యారు.

ఇక అప్పటి నుండి నియోజకవర్గ పరిధిలోని కమలం పార్టీలో ఉన్న నేతలు ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారట. నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం చేసిన కూడా వాల్దస్ మల్లేశం గౌడ్ కి, రఘువీరారెడ్డికి సమాచారం ఇవ్వండం లేదట మురళీ యాదవ్. మొన్న రాష్ట్ర బడ్జెట్ పై నిరసన తెలియజేసే కార్యక్రమానికి కూడా వీరికి చెప్పకుండానే నిర్వహించడట మురళీ యాదవ్. దీంతో ఈ నేతల మధ్య ఉన్న గ్యాప్ ఇంకాస్త ముదిరిందట. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తితో పాటు, బీజేపీ తరపున ప్రచారం చేయలేదని మల్లేశం గౌడ్, రఘువీరారెడ్డికి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి నోటీసులు కూడా వచ్చాయట. ఈ నోటీసులు ఇప్పించింది కూడా మురళీ యాదవే అని. ఈ నోటిసుల వెనుక మురళీ యాదవ్ పాత్ర ఉందని నియోజకవర్గానికి చెందిన కొంతమంది సీనియర్ నేతలు గట్టిగానే ఆరోపించారు.

తాము ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేయలేదని అనడం సరికాదని, మురళీ యాదవ్ కి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తరువాత మమ్మల్ని 20 రోజులైన కూడా కలువలేదని, అయినా తాము పార్టీకోసం పనిచేశామని ఈ ఇద్దరు నేతలు పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మురళీ యాదవ్ సపోర్ట్ చేయలేదని, ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం మురళీ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మల్లేశం గౌడ్, రఘువీరారెడ్డి. మరో వైపు పార్టీలో ఎవరు ఉన్న లేకున్నా, టికెట్ల కోసం కొంతమంది పార్టీ మారినా.. తాను మాత్రం పార్టీలోనే ఉంటూ వచ్చానని మల్లేశం గౌడ్ పార్టీ సీనియర్లకు చెప్పుకొచ్చడట. అలాగే నియోజకవర్గ పరిధిలో పార్టీ ఏ కార్యక్రమంకు పిలుపునిచ్చిన దాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా సక్సెస్ చేసానని, ఇలా తనకు వచ్చిన నోటీసులకు, రీప్లేగా ఈ విషయాలు అన్ని వ్రాసి ఇచ్చాడట మల్లేశం గౌడ్.

మరో వైపు మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ తరుపున బాగానే పనిచేసాడట మల్లేశం గౌడ్. నియోజకవర్గ వ్యాప్తంగా తిరుగుతూ ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు తరఫున విస్తృతంగా ప్రచారం చేశాడట. అందుకే మొన్న మల్లేశం గౌడ్ కి వచ్చిన నోటీసులపై, ఎంపీ రఘునందన్ రావు కూడా పార్టీ పెద్దలతో మాట్లాడారట. నేతలందరూ ఎంపీ ఎన్నికల్లో బాగా కష్ట పడ్డారు కాబట్టే, ఎంపీ రఘునందన్ మద్దతు తమ నేతకు ఉందని, మల్లేశం గౌడ్ అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారట.

మురళీ యాదవ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ గా మల్లేశం గౌడ్ బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ గా బాగానే పనిచేసారట. ఎమ్మెల్యే ఎన్నికల ముందు మురళీ యాదవ్ బీఆర్ఎస్ నుండి, బీజేపీలో చేరిన తరువాత కూడా కొద్దిరోజులు బాగానే ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నికలు రాగానే ఈ ఇద్దరి నేతల మధ్య గొడవలు మొదలు అయ్యాయట. కావాలనే మురళీ యాదవ్ తనను దూరం పెడుతున్నాడని, పార్టీ కోసం ఇంత కష్టపడ్డ తనను ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు మల్లేష్ గౌడ్. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తాను పార్టీకోసం ఎంత కష్టపడ్డానో పార్టీ గుర్తిస్తే చాలు అని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తంచేసాడట మల్లేశం గౌడ్.

మరో వైపు ఈ ఇద్దరి నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో పార్టీ కార్యకర్తలు నలిగి పోతున్నారట. పార్టీ కార్యక్రమాలకు సైతం సరిగ్గా హాజరుకావడం లేదట. మురళీ యాదవ్, మల్లేషం గౌడ్ కలిసి పార్టీ కార్యక్రమాలు చేయడం లేదట. .ఒకరి ప్రోగ్రామ్ కి వెళ్తే, ఇంకొకరికి కోపము వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో అసలు ప్రోగ్రాంలకే హాజరు కాకుండా ఉంటే బెటర్ అని డిసైడ్ అయ్యారట. ఇంతా జరుగుతున్న పార్టీ అధినాయకత్వం వీరిద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడం లేదని నర్సపూర్ నియోజకవర్గ బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారట. మరో వైపు ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న బీజేపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం పార్టీకి నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నర్సాపూర్ నియోజకవర్గంపై దృష్టి పెట్టి, పార్టీకి తిరిగి పూర్వ వైభవం తేవాలని కోరుతున్నారు నర్సాపూర్ బీజేపీ పార్టీ డై హార్ట్ కార్యకర్తలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…