మరమ్మత్తులకు నోచుకోని ఆ ప్రాజెక్టు.. వృధాగా వరదనీరు.. రైతుల ఆవేదన

కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తుల పనులు ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్ట్‌ను వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు.. వరదొచ్చింటే.. వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా రెండేళ్లు వరద కష్టాలను ఎదుర్కొన్న కడెం ముచ్చటగా మూడోఏడాది కూడా అదే దుస్తితి నెలకొంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో కొట్టామిట్టాడుతూ, మరమ్మత్తులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది.

మరమ్మత్తులకు నోచుకోని ఆ ప్రాజెక్టు.. వృధాగా వరదనీరు.. రైతుల ఆవేదన
Kadem Project
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:53 AM

కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తుల పనులు ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్ట్‌ను వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు.. వరదొచ్చింటే.. వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా రెండేళ్లు వరద కష్టాలను ఎదుర్కొన్న కడెం ముచ్చటగా మూడోఏడాది కూడా అదే దుస్తితి నెలకొంది. గత రెండేళ్లుగా నిధుల కొరతతో కొట్టామిట్టాడుతూ, మరమ్మత్తులకు నోచుకోలేక వరదల్లో మునుగుతూ తేలుతూ ప్రయాణం సాగిస్తోంది. ఈసారి కూడా కడెం ప్రాజెక్ట్‎పై మళ్లీ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మరమ్మత్తుల పేరిట మూడు గేట్లను అధికారులు ఎత్తడంతో.. అందులో నుండి వరద నీరు వృధాగా పోతుంది. నెలలు గడుస్తున్నా.. కౌంటర్ వెయిట్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంది కడెం ప్రాజెక్టు. పూర్తి కాని కడెం ప్రాజెక్టు 1,2,3 గేట్లు నుండి వృధాగా గోదావరిలోకి వరద నీరు పోతుంది. మూడు వరద గేట్ల కౌంటర్ వెయిట్లు పూర్తి కాకపోవడంతో నాలుగు రోజులుగా వరద ఇన్ ఫ్లోను ఒడిసిపట్టుకోలేకపోతున్నారు కడెం అధికారులు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరద నీరును వృద్ధాగా పోతుందంటుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 677.500 అడుగులు ఉంది.. ఇన్ ఫ్లో 1649 క్యూసెక్కులు. రెండేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన కడెం ప్రాజెక్టు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తుల కోసం నిధులు విడుదల చేశారు. అయితే మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. వర్షకాలం ప్రారంభానికి ముందే మరమత్తులు పూర్తి కాకుంటే మళ్లీ పాతకథ రీపీట్ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.1969 నుంచి పూర్తిస్థాయిలో సాగుకు అందుబాటులోకి వచ్చింది కడెం ప్రాజెక్ట్. అయితే 2022లో భారీగా పోటెత్తిన‌ వరదతో ప్రమాదంలో పడింది. ప్రతీఏడాది ఎదుర్కొంటున్న సమస్య ఈసారి జులై టెన్షన్ వెంటాడుతోంది. ఇప్పటికైనా కడెం ప్రాజెక్ట్ గట్టెక్కగలుగుతుందా.? తొలి వరద ముప్పును ఈసారి తట్టుకోగలుతుందా?. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
బెదిరించి తీసుకువెళ్లాడని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన యువతి
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
మాంసాహారం లేనిదే ముద్ద దిగదా..! ఈ సీజన్‌లో ఈ ఆహారం తినొద్దు
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..
టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
టార్చ్ లైట్ పట్టుకొని జనమే వస్తారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు..
హైదరాబాద్‏లో మూడు చోట్ల సరికొత్త రికార్డులు..
గుప్త నవరాత్రులు చేస్తున్నారా కలశ ఏర్పాటు చేయడంలో నియమాలు ఏమిటంటే
గుప్త నవరాత్రులు చేస్తున్నారా కలశ ఏర్పాటు చేయడంలో నియమాలు ఏమిటంటే
లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
జామ పండ్లతోనే కాదు.. ఆకులలో కూడా ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్యమే!
జామ పండ్లతోనే కాదు.. ఆకులలో కూడా ఔషధ గుణాలు.. తెలిస్తే ఆశ్చర్యమే!
మత్తుమందు ఇచ్చి కారులో రేప్ చేసిన తోటి ఉద్యోగులు
మత్తుమందు ఇచ్చి కారులో రేప్ చేసిన తోటి ఉద్యోగులు
పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు..
పూరీ ఆలయమే కాదు.. రథయాత్రలో కూడా ఎన్నో అద్భుతాలు..