Bird Flu Virus: బర్డ్ ఫ్లూతో మృతి చెందిన మొదటి వ్యక్తి .. చికెన్ తినాలా వద్దా.. తెలంగాణ ప్రభుత్వం సూచనలివే..

బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మానవ మరణం మెక్సికోలో నమోదైంది. ప్రపంచంలో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌5ఎన్‌1) కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 7 శుక్రవారం నాడు తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మానవ మరణం సంభవించినట్లు ప్రకటించింది. ఈ కేసు మెక్సికోలో నమోదైనట్లు స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపిన వివరాల ప్రకారం, 59 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.

Bird Flu Virus: బర్డ్ ఫ్లూతో మృతి చెందిన మొదటి వ్యక్తి .. చికెన్ తినాలా వద్దా.. తెలంగాణ ప్రభుత్వం సూచనలివే..
Bird Flu
Follow us

|

Updated on: Jun 08, 2024 | 12:57 PM

బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మానవ మరణం మెక్సికోలో నమోదైంది. ప్రపంచంలో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌5ఎన్‌1) కారణంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్‌ 7 శుక్రవారం నాడు తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మానవ మరణం సంభవించినట్లు ప్రకటించింది. ఈ కేసు మెక్సికోలో నమోదైనట్లు స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపిన వివరాల ప్రకారం, 59 ఏళ్ల వ్యక్తి గత కొంత కాలంగా తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అతిసారం, వికారంతో బాధపడినట్లు ప్రకటించింది. చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రకటన విడుదల చేసిందని తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది.

దీనిపై ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రముఖ ఇంగ్లీష్‌ పత్రిక ది హిందూ నివేదిక ప్రకారం.. గాలి ద్వారా సంక్రమించే ఇలాంటి వ్యాధులకు ప్రధాన కారణం పక్షిజాతి జంతువులే అని తెలిపింది. ఈ జాబితాలో అధికంగా కోళ్లు, బాతులు ఇతర పక్షులు ఉన్నట్లు వివరించింది. ఇవి సాధారణంగా పెద్ద సంఖ్యలో ఆనారోగ్య సమస్యలకు గురి చేస్తాయని తెలిపింది. ఒకరికి సోకితే ఆ వ్యాధి వ్యాప్తి అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి ప్రబలే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పెరటి పక్షులు, పావురాలు ఇలా ఇతర జాతులతో సహా, మానవులు పెంచుకునే కొన్ని రకాలా అటవీజాతి పక్షుల కారణంగా కూడా అధిక ప్రమాదం ఉందని తన నివేదికలో పొందుపరిచింది. ప్రమాద తీవ్రత చాలా ఎక్కవగా ఉంటుందని చెప్పింది. ఇంట్లో పెంచుకునే పక్షులే కాకుండా లైవ్ బర్డ్ మార్కెట్లు, కోళ్ల ఫారమ్ లద్వారా కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పక్షుల జాతి నుంచి కూడా సంక్రమించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా పొలాలలో పౌల్ట్రీని నిర్వహించే వ్యక్తులు, అలాగే పౌల్ట్రీ కీపర్లు, పక్షులు ఉండే పరిసరాలకు దగ్గరగా ఉండే వారు, తరచుగా ఆ ప్రాంతాల్లో సంచరించడం వలన అధిక ప్రమాదం సంభవిచే అవకాశం ఉందని పేర్కొంది.

బర్డ్ ఫ్లూ (H5N1) నిరోధించడానికి ముఖ్య సూచనలు..

  • వ్యాధి సోకిన లేదా అనుమానిత పక్షులు, జంతువులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం.
  • అలాంటి లక్షణాలు ఉన్న జంతువులు, వ్యక్తులకు దూరంగా ఉండటం.
  • చికెన్, గుడ్లు లాంటివి పచ్చిగా లేదా తక్కువగా ఉడికించిన వాటిని తినకపోవడం.
  • ముఖ్యంగా పౌల్ట్రీ ఉత్పత్తులకు దూరంగా ఉండటం.
  • ఒకవేళ తినాలనిపిస్తే అందులోని వైరస్‎ను చంపడానికి 70°C వరకు ఉడికించాలి.
  • పౌల్ట్రీ గుడ్లను తాకిన తర్వాత చేతులు బాగా సబ్బుతో కడగాలి.
  • చేతులు శుభ్రంగా కడగకుండా శరీరంలోని వివిధ భాగాలకు, చర్మానికి తాకకుండా జాగ్రత్తలు వహించాలి.
  • శానిటైజర్ వాడకం, పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
  • అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నవారి బట్టలు, పాత్రలు, ఇతర వస్తువుల తాకడం మానుకోవాలి.

బర్డ్ ఫ్లూ ముఖ్య లక్షణాలు:

  • తరచూ తీవ్ర జ్వరం
  • దగ్గు
  • శ్వాస సమస్యలు
  • కండరాల నొప్పులు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..