ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహ రెడ్డి (TNR) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుముశారు. ఆయన మరణంతో జర్నలిస్ట్, సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురైంది.
తుమ్మల నరసింహ రెడ్డి.. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. యూ ట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈయన పని చేస్తుంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృధుస్వభావి టీఎన్ఆర్. అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం.. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే స్వభావం ఈయన్ని చాలా మందికి దగ్గర చేసాయి. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన టిఎన్ఆర్.. వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది. అయితే ఉన్నట్లుండి ఈయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తెల్లవారుజామున కన్నుముశారు. టీఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: లైవ్లో వాట్సప్ నంబర్ అడిగిన నెటిజన్.. మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పిన సింగర్ సునీత..