Gorilla: గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.! రెండు సింహాలు ఒకేసారి మీదదిపోతే

గొరిల్లాలు ప్రపంచంలోనే అతిపెద్ద వానర జాతి. ఇవి మనుషులతో దాదాపు 98 శాతం జన్యువులను పంచుకుంటాయి. అద్భుతమైన శరీర బలంతో పాటు, ఇవి శాఖాహారాన్ని మాత్రమే తింటాయి. సమూహాలుగా జీవించే గొరిల్లాలు భావాలను కూడా వ్యక్తం చేయగలవు. వీటిని అడవిలోని సున్నిత మనసున్న మహాకాయులు అని పిలుస్తారు.

Gorilla: గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.! రెండు సింహాలు ఒకేసారి మీదదిపోతే
Gorilla

Updated on: Mar 21, 2026 | 12:02 PM

గొరిల్లాలు ప్రపంచంలోనే అతిపెద్ద వానర జాతిగా గుర్తింపు పొందాయి. వీటి ప్రత్యేకత కేవలం భారీ శరీరం మాత్రమే కాదు.. మనుషులతో దాదాపు 98 శాతం జన్యువులను పంచుకోవడం. ఇది మానవులకు, గొరిల్లాలకు మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. దీని కారణంగానే, మానవులకు వచ్చే జలుబు వంటి వ్యాధులు వీటికి కూడా సోకే అవకాశం ఉంది. బరువు విషయానికి వస్తే, ఒక పెద్ద గోరిల్లా సుమారు 180 కిలోల వరకు బరువు ఉంటుంది. అయితే, అవి వాటి బరువుకు 27 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలవు. అంటే, సుమారు 2000 కిలోల బరువును కూడా ఇవి సునాయాసంగా పైకి లేపగలవు. ఒక పెద్ద గొరిల్లా తన బరువుకి పది రెట్లు ఎక్కువ బరువును సైతం అలవోకగా ఎత్తగలదు. ఇది వాటి అపారమైన బలానికి నిదర్శనం.

గోరిల్లాల కొరికే శక్తి కూడా చాలా భయంకరమైనది, వాటి బైట్ ఫోర్స్ 1300 PSIగా నమోదైంది. ఈ శక్తి రెండు సింహాలు ఒకేసారి కొరికితే ఎంత బలం ఉంటుందో అంతకు సమానం. ఇంతటి శక్తివంతమైన శరీరం ఉన్నప్పటికీ, గొరిల్లాలు ఎక్కువగా ఆకులు, పండ్లు, వేరుశనగలు, కూరగాయలు వంటి శాఖాహారాన్నే తింటాయి. ఇవి సమూహాలుగా జీవిస్తాయి. ఈ సమూహాన్ని ట్రూప్ అని అంటారు. ఈ ట్రూప్‌కు నాయకత్వం వహించే పెద్ద మగ గొరిల్లా వెన్నుపై వెండి రంగు వెంట్రుకలను కలిగి ఉంటుంది, అందుకే దీనిని సిల్వర్ బ్యాక్ అని పిలుస్తారు.

మనుషుల మాదిరిగానే, గొరిల్లాలు కూడా భావాలను వ్యక్తం చేయగలవు. అవి నవ్వుతాయి, కోపం చూపిస్తాయి, ఆప్యాయతలను పంచుకుంటాయి. ఈ కారణాల వల్లనే వీటిని అడవిలో “సున్నిత మనసున్న మహాకాయులు” అని కూడా పిలుస్తారు. గొరిల్లాల జీవితశైలి, ప్రవర్తన ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణి సంరక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. దురదృష్టవశాత్తు, మౌంటైన్ గోరిల్లా జాతి తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1063 మౌంటైన్ గోరిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, వాటి సంరక్షణకు తక్షణ చర్యలు అవసరం.

Follow Us