Telangana: దావత్‌ చేసుకుంటున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే…

తెలంగాణలో జరుగుతున్న వివిధ ఫంక్షన్లు, పార్టీలపై ఆబ్కారీశాఖ నిఘా పెట్టనుంది. ఫంక్షన్లలో మద్యం వినియోగానికి ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెబుతోంది. అలా చేయకపోతే... కేసులు నమోదవుతాయని స్పష్టం చేసింది.

Telangana: దావత్‌ చేసుకుంటున్నారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే...
Liquor
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 13, 2024 | 1:49 PM

తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా దావత్ జరుగుతుంది. మటన్ చుక్క.. మందు చుక్క లేకుండా పార్టీ అంటే పార్టీనే కాదు తెలంగాణలో. లిక్కర్ సేల్స్ కూడా రాష్ట్రంలో ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రవేట్ పార్టీలపై ఫోకస్ పెట్టనుంది అబ్కారీ శాఖ. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ వినియోగంపై ఇప్పటికే కొరడా ఝులిపిస్తుంది. ఈ క్రమంలోనే ఫంక్షన్లు, పార్టీలపై కూడా నిఘా పెట్టనుంది. ఈ మేరకు ప్రత్యేక టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఏ ఈవెంట్ అయినా మద్యం వినియోగానికి.. ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ మాత్రమే పార్టీల్లో వినియోగించాలి.

కానీ అబ్కారీ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న వారిలో కొందరు… తక్కువ రేటుకు వస్తున్న మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. ముఖ్యంగా లిక్కర్ రేటు తక్కువగా ఉండే కేంద్రపాలిత ప్రాంతాలైన… గోవా, యానం నుంచి సీక్రెట్‌గా మద్యాన్ని తెచ్చి.. పార్టీల్లో వాడుతున్నారు. దీంతో గవర్నమెంట్ ఖజానికి నష్టం చేకూరుతుంది. దీంతో ఎక్సైజ్ కమిషనర్‌ శ్రీధర్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు టీమ్స్ రెడీ అయ్యాయి. దావత్‌లు, ఈవెంట్లకు పర్మిషన్స్ తీసుకోకపోవడం నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ వినియోగంపై ఈ ఏడాదితో 302 కేసులు ఫైల్ చేశారు. ఈ కేసుల్లో 165 మంది నిందితులుగా గుర్తించి.. 35 వెహికిల్స్ సీజ్ చేశారు. రూ.61.13 లక్షల విలువైన లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. ఇకపై పార్టీలు, దావత్‌లపై కఠినమైన నిఘా కొనసాగుతుందని.. అనుమతులు లేకపోతే చిక్కులు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..