Bandi Sanjay: బండి సంజయ్ ఫిర్యాదుతో కదిలిన ఈడీ.. గ్రానైట్ కంపెనీలకు నోటీసులు..

|

Aug 03, 2021 | 6:35 PM

కరీంనగర్ గ్రానైట్ కంపెనీల అక్రమాలపై ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కన్నేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు మేరకు జిల్లాలోని తొమ్మిది...

Bandi Sanjay: బండి సంజయ్ ఫిర్యాదుతో కదిలిన ఈడీ.. గ్రానైట్ కంపెనీలకు నోటీసులు..
Companies
Follow us on

కరీంనగర్ గ్రానైట్ కంపెనీల అక్రమాలపై ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కన్నేసింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు మేరకు జిల్లాలోని తొమ్మిది గ్రానైట్ కంపెనీలకు నోటిసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా వివిధ దేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నట్లు బండి సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరీంనగర్ నుంచి వివిధ దేశాలకు నిబంధనలకు విరుద్ధంగా ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెలలో చెన్నై ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీకి ఈడీ నోటిసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్వేత ఏజెన్సీ, ఎ.ఎస్‌.షిప్పింగ్‌, జేఎం బ్యాక్సీ, మైథిలి ఆధిత్యట్రాన్స్‌ పోర్ట్‌, కేవీఎ ఎనర్జీ, అరవింద్‌ గ్రానైట్‌, శాండియా ఏజెన్సీస్‌, పి.ఎస్‌.ఆర్‌ ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌ అండ్‌ లాజిస్టిక్‌లు ఈడీ నోటిసులు జారీ చేసిన కంపెనీల లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!

నడిరోడ్డుపై యువతి హాల్‌చల్‌.. వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ రచ్చ.. హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌!

కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ ఫోటోలో ఏ జీబ్రా ముందుకు ఉంది.? మొత్తం ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!