పాఠాలు చెప్పాల్సిన పండితుడు.. పీకలదాకా తాగొచ్చాడు.. సీన్ కట్ చేస్తే.!
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్క మొహం వేశారు. ఈ ఘటన కొమురం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. జైనూర్ మండలం సుకుద్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో SGTగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్ దగ్గర పడిపోయాడు.
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులు.. పట్టపగలే పీకల దాకా తాగి పడిపోయాడు. చదువు చెప్పేవారు లేక పిల్లలంతా బిక్క మొహం వేశారు. ఈ ఘటన కొమురం భీమ్ జిల్లాలో చోటు చేసుకుంది. జైనూర్ మండలం సుకుద్‌పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో SGTగా పనిచేస్తున్న విలాస్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలోకి వచ్చి పిల్లలకు చదువు చెప్పకుండా టేబుల్ దగ్గర పడిపోయాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల నివేదికతో SGT విలాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 04, 2025 07:20 AM
Loading...
Unable to load recommendations.
Follow Us