Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా..

Telangana Smart Ration Cards: రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్‌ కోడ్‌తో రూపొందించిన రేషన్‌ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం చేరవేసింది. ఈ..

Telangana Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో ఇలా..
Telangana Smart Ration Card

Updated on: Aug 13, 2026 | 10:07 PM

Telangana Smart Ration Cards: తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేసేందుకు సర్కార్ రెడీ అయ్యింది. ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనుంది. ఇందు కోసం కార్డు మోడల్‌ను విడుదల చేసింది. అయితే రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్మార్ట్ రేషన్ కార్డును విడుదల చేసింది. కొత్త తరహాలో కార్డులను తీసుకువచ్చింది ప్రభుత్వం. ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల వివరాలను వేగంగా గుర్తించేలా ఉపయోగపడనున్నాయి. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను ఆగస్ట్ 15 నుంచి జారీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్‌ కోడ్‌తో రూపొందించిన రేషన్‌ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం చేరవేసింది. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించారు.

ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి

దీంతో పాటు రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబర్ వంటి వివరాలను ఉండనున్నాయి. లబ్ధిదారులను సులభంగా గుర్తించేందుకు అవసరమైన సమాచారం కూడా ఆ కార్డులో ఉంటాయి. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కార్డును దుర్వినియోగం చేయడం, నకిలీ తయారీకి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వ హోలోగ్రామ్, ఎంబోస్డ్ టెక్స్ట్, మైక్రో టెక్స్ట్, వాటర్‌మార్క్, ఇన్విజిబుల్ యూవీ లోగో, గిల్లొషే ప్యాటర్న్స్ వంటి పలు భద్రతా అంశాలను పొందుపరిచారు. కార్డుపై డిజిటల్‌ క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది.

Telangana Smart Ration Cards

ఇది కూడా చదవండి: Cab Booking New Rule: మీరు క్యాబ్ బుకింగ్‌ చేసుకుంటున్నారా? కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక ఆ ఫీచర్‌ తొలగింపు..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us