Revanth Reddy: అమెరికా బ‌య‌లుదేరిన సీఎం రేవంత్.. భారీ లక్ష్యంగా టూర్‌..

రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డే ల‌క్ష్యంగా సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ఇది వ‌ర‌కే అధికారులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మొద‌ట హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్క‌డ ఆరోజు రోజుల అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకొని...

Revanth Reddy: అమెరికా బ‌య‌లుదేరిన సీఎం రేవంత్.. భారీ లక్ష్యంగా టూర్‌..
Revanth Reddy
Follow us

|

Updated on: Aug 03, 2024 | 6:47 AM

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. 10 రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాతో పాటు, ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందులో భాగంగానే శ‌నివారం ఉద‌యం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముఖ్య‌మంత్రితో పాటు, మంత్రి శ్రీధ‌ర్ భాబు.. అధికార‌లు బృందం అమెరికాకు బ‌య‌లు దేరి వెళ్లారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబ‌డే ల‌క్ష్యంగా సీఎం విదేశీ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని ఇది వ‌ర‌కే అధికారులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మొద‌ట హైద‌రాబాద్ నుంచి న్యూయార్క్ చేరుకుంటారు. అక్క‌డ ఆరోజు రోజుల అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా ద‌క్షిణ కొరియా వెళ్తారు. అనంత‌రం అక్క‌డ ప‌ర్య‌ట‌న ముగించుకొని తిరిగి సీఎం బృందం ఈ నెల 14వ తేదీన ఉద‌యం హైద‌రాబాద్‌కు తిరిగి చేరుకుంటారు.

ఈ పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చర్చ‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అంత‌ర్జాతీయ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. వీరిలో ప్ర‌ముఖంగా అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ సీవోవో, పెప్సీ కో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన వారు ఉన్నారు.

ఇక ప్ర‌పంచ బ్యాంకు అధ్య‌క్షుడితోనూ సీఎం భేటీ కానున్నారు. ఈ నెల‌6వ తేదీ వాషింగ్ట‌న్‌లోని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ మీటింగ్ ఉండ‌నుంది. మూసీ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి ఆయనకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎం బృందం వివ‌రించ‌నుంది. ఈ ప్రాజెక్టుల్లో ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యం కావాలని, ఆర్థిక సాయం చేయాలని కోరే అక‌వాశాలు ఉన్నాయి.

ఇక స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ కూడా సీఎం సంద‌ర్శించ‌నున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంపైనా అక్కడి డీన్‌తో మాట్లాడనున్నారు. అనంతరం శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జిని సందర్శించనున్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టబోయే అంశాలను అక్కడ పరిశీలించనున్నారు. ఇక దక్షిణ కొరియా పర్యటనలో టెక్స్‌టైల్‌ దిగ్గజ కంపెనీలతో సీఎం సమావేశం కానున్నారు.

మ‌రిన్ని తెలంగాణ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!