తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వయంగా సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రతి ఎకరానికీ ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. వీటితో పాటు భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా రూ.12 వేలు సాయం అందించేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. ఇక ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ జరగనుంది.
ఇతర కేబినెట్ నిర్ణయాలు:
సీఎం వెల్లడించిన కేబినెట్ నిర్ణయాలను దిగువన వీడియోలో చూడండి….
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి