కొండపోచమ్మ ఒడిలోకి గోదారమ్మ..

కాళేశ్వరం కల నెరవేరుతోంది.. సీఎం కేసీఆర్‌ స్వప్నం సాకారమవుతోంది. రైతాంగం గోస తీర్చేందుకు గోదావరి పరుగులీడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ ప్రారంభానికి వేళయ్యింది. నేడు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.. రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. భువి నుంచి అరకిలోమీటరుకు పైగా ఎత్తులోకి ఎగిసేందుకు సిద్ధమయ్యింది. కాలువలు, చెరువులు, […]

  • Sanjay Kasula
  • Publish Date - 7:48 am, Fri, 29 May 20
కొండపోచమ్మ ఒడిలోకి గోదారమ్మ..

కాళేశ్వరం కల నెరవేరుతోంది.. సీఎం కేసీఆర్‌ స్వప్నం సాకారమవుతోంది. రైతాంగం గోస తీర్చేందుకు గోదావరి పరుగులీడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్‌ ప్రారంభానికి వేళయ్యింది. నేడు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు..

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.. రాష్ట్ర సరిహద్దులో సముద్రమట్టానికి వంద మీటర్లలోపే పారే గోదారమ్మ గరిష్ఠ ఎత్తుకు చేరే కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారయ్యింది. భువి నుంచి అరకిలోమీటరుకు పైగా ఎత్తులోకి ఎగిసేందుకు సిద్ధమయ్యింది. కాలువలు, చెరువులు, రిజర్వాయర్లను నిండుకుండలా మారుస్తూ వందల కిలోమీటర్లు ప్రయాణించిన కాళేశ్వరం జలాలు నేడు 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ సిగలో కొలువుతీరనున్నాయి. సీఎం కేసీఆర్‌ నేడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో రెండు మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు.

త్రిదండి చినజీయర్‌స్వామి యజ్ఞం నిర్వహించి ఆశీర్వచనం అందజేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని మర్కూక్‌ -పాములపర్తి గ్రామాల సమీపంలో 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని శ్రీరంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 16 కిలోమీటర్ల సొరంగం ద్వారా మల్లన్నసాగర్‌ పంప్‌హౌస్‌కు చేరుకున్న గోదావరి జలాలు అక్కడ ఎత్తిపోయడం ద్వారా అక్కారం పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి మర్కూక్‌ పంపుహౌజ్‌కు వచ్చిచేరాయి. మర్కూక్‌లో మరోసారి ఎత్తిపోయడం ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరనున్నాయి.

ఈ కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ను ప్రముఖ మేగా ఇంజినీరింగ్‌ సంస్థ నిర్మించింది. కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ పనులను రికార్డు సమయంలో పూర్తి చేసింది. మేగా సంస్థ నైపుణ్యం, అనుభవం రిజర్వాయర్‌ నిర్మాణంలో బాగా ఉపయోగపడింది. నాణ్యతకు పెద్దపీట వేస్తూ రిజర్వాయర్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. అనుకున్న సమయానికి.. కేసీఆర్‌ సంకల్పానికి అనుగుణంగా రిజర్వాయర్‌ పనులను వేగంగా చేపట్టి శభాష్‌ అనిపించుకుంది మేగా ఇంజినీరింగ్‌ సంస్థ.