Hyderabad: పాతబస్తీని.. ప్రశాంతబస్తీగా మార్చేందుకు ముస్లిం మతపెద్దల వినూత్న ఆలోచన..!

హైదరాబాద్‌ మహానగరంలో వరుస హత్యలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో వరుస హత్యలు, దాడులు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డ్రగ్స్‌ మత్తులో యవత అరాచకాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ ఉన్నా కూడా గత కొన్ని రోజులుగా నేరాలు పెరగడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: పాతబస్తీని.. ప్రశాంతబస్తీగా మార్చేందుకు ముస్లిం మతపెద్దల వినూత్న ఆలోచన..!
Clergy Assembled
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 02, 2024 | 5:53 PM

హైదరాబాద్‌ మహానగరంలో వరుస హత్యలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలో వరుస హత్యలు, దాడులు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డ్రగ్స్‌ మత్తులో యవత అరాచకాలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి వేళ పెట్రోలింగ్ ఉన్నా కూడా గత కొన్ని రోజులుగా నేరాలు పెరగడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు..పాతబస్తీలోని పలు వీధుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న పోకిరిలు, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోవైపు పాతబస్తీని… ప్రశాంతబస్తీగా మార్చేందుకు భేటీ అయ్యారు ముస్లిం మతపెద్దలు. హత్యలు, అల్లర్లను తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత కొన్ని నెలల నుంచి హైదరాబాద్‌ పాతబస్తీ అల్లర్లు, హత్యలకు కేరాఫ్‌గా మారింది. వరుస నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాత కక్షలు భగ్గుమంటున్నాయి. దీంతో మత పెద్దలంతా ఒక్కచోట చేరారు. మన పాతబస్తీ.. మన బాధ్యత అంటూ ముందుకు కదిలారు. పాతబస్తీని ప్రశాంతంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు. పాతబస్తీ దారుషిఫాలోని ఓ మసీదులో భేటీ అయ్యారు. హద్దులు దాటుతున్న వాళ్లను కంట్రోల్‌ అదుపులోకి తెచ్చి, క్రైమ్‌ అనేదే లేకుండా చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మతపెద్దలు.

అల్లర్లు, హత్యలు అనే మాటే లేకుండా ప్రశాంత వాతావరణం ఎలా కల్పించాలన్న అంశంపై మత పెద్దలు ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యంగా డ్రగ్స్‌ వల్లే అనర్థాలు ఎక్కువయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. దీంతో యువతను డ్రగ్స్‌ నుంచి దూరం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు డిసైడ్‌ అయ్యారు. అంతేకాదు బృందాలుగా ఏర్పడి పాతబస్తీలోని ప్రతి ప్రాంతానికి వెళ్లి… అందరిలోనూ అవేర్‌నెస్‌ పెంచాలని నిర్ణయించారు. తమవంతు బాధ్యతగా వ్యవహరిస్తూ… పోలీస్‌ శాఖకు సహకరించాలని తీర్మానించారు. అలాగే ఓల్డ్‌సిటీలోని ప్రతిఒక్కరూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మత పెద్దలు.

మొత్తంగా… గతకొన్ని నెలల నుంచి పాతబస్తీలో నేరాలు ఎక్కువయ్యాయి. కొన్ని రోజల క్రితమే చాదర్‌ఘాట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత కక్షలతో రౌడీషీటర్ దారుణ హత్యకు గురవ్వడం, మొన్నటికి మొన్న కొందరు యువకులు పరస్పరం కత్తులతో దాడి చేసుకోవడం, అలాగే డ్రగ్స్‌ మత్తులో రోడ్లపై యువత రెచ్చిపోవడంలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత పెద్దలంతా భేటీ అయ్యి నేర నియంత్రకు కంకణం కట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..