Telangana: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ మరో ముందడుగు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా..

Telangana: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ మరో ముందడుగు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
Follow us

|

Updated on: Apr 13, 2022 | 1:46 PM

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ (Somesh Kumar) టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఇందులో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి లు కూడా పాల్గొన్నారు. ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి సీఎస్ సూచించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలు లో నిమగ్నం చేయాలన్నారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్‌ సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి.

గత యాసంగిలో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలి. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలని, దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలన్నారు.

క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర:

కాగా, క్వింటాల్ కు రూ.1960 కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగిందని, వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏ విధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలి. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలని, జిల్లాలో వారి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోలని సమావేశంలో సీఎస్‌ సూచిచారు. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని, దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని సీఎస్‌ సోమేష్ కుమార్‌ కలెక్టర్లకు సూచించారు.

ఇవి కూడా చదవండి:

PNB: కస్టమర్లకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు గుడ్‌న్యూస్‌.. కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు.. ఎలాగంటే..!

PAN Card Reprint: మీ పాన్‌ కార్డు పోయిందా..? టెన్షన్‌ అక్కర్లేదు.. ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డు వచ్చేస్తుంది!

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?