Peddavagu: పెద్దవాగుకు గండి.. ముంచుకొచ్చిన ఉపద్రవం.. నీటమునిగిన పలు గ్రామాలు

రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిపడ్డ వరద ఊళ్లకు ఊళ్లని చుట్టుముట్టింది. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్లమీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.

Peddavagu: పెద్దవాగుకు గండి.. ముంచుకొచ్చిన ఉపద్రవం.. నీటమునిగిన పలు గ్రామాలు
Peddavagu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 20, 2024 | 7:37 AM

రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత వచ్చిపడ్డ వరద ఊళ్లకు ఊళ్లని చుట్టుముట్టింది. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. ఉప్పెనలా వచ్చి ఊర్లమీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. బాధితులు చెట్టుకొకరు.. పుట్టకొకరుగా చెల్లాచెదరయ్యారు. ముంపు భయంతో ఇళ్లపైకి చేరిన నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారు. ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది.

పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు.. మొత్తం 20 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు మేకలు కొట్టుకు పోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు నేల కొరిగి వరదలో కలిసి పోయాయి. ఎన్నో ఆశలతో సాగుచేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసి అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

పెద్దవాగు వరద లోతట్టు ప్రాంతాలవైపు మళ్లడంతో ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది. మామూలుగా అయితే పెద్దవాగు నిండితే నేరుగా వెళ్లి బంగాళా ఖాతంలో కలుస్తుంది. కానీ ప్రాజెక్ట్‌కు గండి పడటంతో వేలేరుపాడు మండలం మొత్తం నీటమునిగింది. అనేక గ్రామాలపై వరద ప్రభావం పడింది. ఇళ్లతో పాటు వేలాది ఎకరాలు నీటమునిగాయి. ఈ గ్రామాల్లో వరదబాధితులంతా గుట్టలపై తలదాచుకుంటున్నారు. అదే పెద్దవాగు వరద జల్లేరుతో పాటు అలివేరు, బైనేరుకు పోటెత్తింది. జల్లేరు రిజర్వాయర్‌కి మామూలుగా వచ్చే వరదతో పాటు పెద్దవాగు నుంచి ఒక్కసారిగా వరద రావడంతో ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల్లేరు మీదుగా అదే పెద్దవాగు వరద ఎర్రకాలువకూ భారీగా వస్తోంది. ఎర్రకాలువ నుంచి యనమదుర్రు అడిక్వేట్‌కి వరద పోటేత్తింది. అంతిమంగా ధవళేశ్వరం దగ్గర వరద పోటెత్తుతోంది.

ఇది రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణలోపానికి తోడు అధికారుల పట్టింపులేని తనం ఆ ప్రాజెక్టుని ముంచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గండి పూడ్చేందుకు రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజుల తేడాతో మీ ఆయుష్షు మూడినట్టే!
మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజుల తేడాతో మీ ఆయుష్షు మూడినట్టే!
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..
గతంలోనూ చాలా సార్లు సర్వడౌన్స్‌.. ఆ సమయంలో ఏం జరిగిందంటే..
ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
ఎయిర్‌టెల్, జియోకు పెద్ద దెబ్బ.. ఓటీటీతో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర తెలిస్తే..
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
అల్లర్లు, కర్ఫ్యూతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్.. అసలు కారణం ఇదే
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గుడ్ న్యూస్..!
సాధారణంగానే అనిపించవచ్చు.. కానీ, ఇవి హార్ట్ బ్లాక్ లక్షణాలు..
సాధారణంగానే అనిపించవచ్చు.. కానీ, ఇవి హార్ట్ బ్లాక్ లక్షణాలు..
వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో
వరుసగా 2 పతకాలతో రికార్డ్.. కట్‌చేస్తే.. నేడు తీహార్ జైలులో
కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో ఫోన్స్
కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌.. అమెజాన్‌ సేల్‌లో రూ. 10 వేలలో ఫోన్స్
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?