Road Accident: యాక్సిడెంట్‎కి గురైన బైరి నరేష్ కారు.. మంగపేట జీడివాగు వద్ద ప్రమాదం

బైరి నరేష్ గత ఏడాది నుంచి తెగ పాపులర్ అయిపోయారు. అయ్యప్ప భక్తులపైనే కాకుండా దేవుని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అయ్యప్ప భక్తున్ని వాహనంతో గుద్ది గాయపరిచిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మంగపేట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Road Accident: యాక్సిడెంట్‎కి గురైన బైరి నరేష్ కారు.. మంగపేట జీడివాగు వద్ద ప్రమాదం
Bairi Naresh
Follow us

|

Updated on: Jan 02, 2024 | 9:42 AM

బైరి నరేష్ గత ఏడాది నుంచి తెగ పాపులర్ అయిపోయారు. అయ్యప్ప భక్తులపైనే కాకుండా దేవుని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అయ్యప్ప భక్తున్ని వాహనంతో గుద్ది గాయపరిచిన ఘటనలో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. మంగపేట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గురైన బైరి నరేష్ వాహనం అదుపు తప్పి జీడివాగు వద్ద చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అతని భార్య, డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.

ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే వాహనాన్ని అక్కడే వదిలేసి బస్సులో బయలుదేరారు బైరి నరేష్. ఈయనతో పాటు సతీమణి, కొడుకు, డ్రైవర్ కూడా ఉన్నారు. అయితే బైరి నరేష్ ఆచూకి కోసం పోలీసులు వెతుకుతున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే ముణుగూరు వైపు వెళ్లినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ విషయం తెలుసుకున్న బైరి నరేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అతని స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం రాములపల్లి లో విశ్రాంతి తీసుకుంటున్నారు బైరి నరేష్.

ఇదిలా ఉంటే బైరి నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అయ్యప్ప భక్తుడి పైకి వాహనం ఎక్కించారని ఏటూరు నాగారంలో అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన అయ్యప్ప భక్తుడు నర్సింగరావ్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై మతవాదులు ఉద్దేశ పూర్వకంగానే దాడి చేశారని నరేష్ ఆరోపిస్తున్నారు. నాస్తిక సమాజం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడమే నరేష్ కర్తవ్యం అని అయ్యప్ప భక్తులు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన నరేష్‎ను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చిరిస్తున్నారు. తన భద్రత కోసం ప్రభుత్వం లైసెన్స్ వెపెన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత ఒలింపిక్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
భారత ఒలింపిక్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..