తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఎప్పుడూ విపక్ష పార్టీల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి.. అయితే.. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. కానీ ఇప్పుడు బాంబుల డైలాగులు బ్లాస్ట్ అవుతున్నాయి. టైమ్ చూసి పొలిటికల్ బాంబులు పేల్చుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బాంబులంటే కేటీఆర్‌కు అంత భయమెందుకంటూ ప్రశ్నించారు. అయితే.. చెప్పిన టైం దాటడంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు.. బాంబులు తుస్సుమన్నాయని ఎవరూ సంబరపడొద్దంటూ మరో వార్నింగ్ కూడా ఇచ్చారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈసారి పేలేది తాటాకు బాంబు కాదు. ఆటం బాంబు పేలుతుందన్నారు. ప్రస్తుతం బాంబు పేలడానికి సిద్ధంగా ఉందన్నారు. విదేశాల్లోనే కాదు సొరంగాల్లో దాచిన అక్రమ సంపాదనంతా వెలికితీస్తామంటూ చెప్పుకొచ్చారు.
ఆటం బాబు పేలుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు తెరిస్తే బాంబులు అంటున్నారని.. అందుకే ఆయన బాంబుల శాఖ మంత్రి అంటూని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏ బాంబ్ పేలి ఎవరు ఎగిరిపోతారో చూసుకోవాలంటూ రీకౌంటర్ ఇచ్చారు కేటీఆర్..
ప్రజలకు ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైఫల్య వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలో హస్తంపార్టీ మోసాలను ఎండగడతామని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..