BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్.. పార్టీ వీడిన జాతీయ ప్రధాన కార్యదర్శి మానిక్ రావు

బీఆర్‌ఎస్‌ను కష్టాలు వీడటం లేదు. ఓ వైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని గుడ్‌బై చెబుతుంటే.. పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ... ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.

BRS: బీఆర్ఎస్‌కు మరో షాక్.. పార్టీ వీడిన జాతీయ ప్రధాన కార్యదర్శి మానిక్ రావు
Manik Rao Kadam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 20, 2024 | 7:58 AM

బీఆర్‌ఎస్‌ను కష్టాలు వీడటం లేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది. ఓ వైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని గుడ్‌బై చెబుతుంటే, మరోపక్క పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోనూ బీఆర్‌ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ.. ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర కిసాన్‌ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావు కదం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కారు దిగి వెళ్లిపోతున్నారు. మానిక్‌రావు కదం మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.

పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు గతంలో అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. దేశవ్యాప్తంగా ఎదిగేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారింది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో మొదటగా అడుగుపెట్టింది. తెలంగాణకు బార్డర్‌గా ఉన్న నాందేడ్, షోలాపూర్ ప్రాంతాల్లో పార్టీని విస్తరించేందుకు కొంతమంది నేతలతో కమిటీలు కూడా వేసింది. నాందేడ్, సోలాపూర్, నాగపూర్ పట్టణాల్లో పార్టీ ఆఫీసులు కూడా ఏర్పాటు చేసింది.

తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి పథకాలు మహారాష్ట్ర రైతులను ఆకర్షించడంతో… అక్కడున్న రైతు ఉద్యమ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. వారందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా కూడా నిర్వహించారు. మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలైన ఎన్సీపీ, శివసేన పార్టీల నుంచి కీలక నేతలను కూడా జిల్లాల వారీగా చేర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ అప్పుడే ప్రకటించారు. అంతేకాదు మహారాష్ట్రవ్యాప్తంగా నాలుగు బహిరంగ సభలు కూడా నిర్వహించారు కేసీఆర్. ఆరు పార్లమెంటు సీట్లలో మొదటి దఫా పోటీ చేసేందుకు కూడా ఫ్లాన్ రెడీ చేశారు.

కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలవడంతో అంతా తారుమారైంది. దీంతో మహారాష్ట్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు కేసీఆర్. అక్కడ పార్టీని విస్తరించేందుకు కీలకంగా పని చేసిన మాణిక్ రావు కదం.. ఇప్పుడు బీఆర్ఎస్ విడిపోయారు. అంతేకాదు ఆయనతో పాటు అనేక మంది రైతు నాయకులు కూడా పార్టీని వీడుతున్నారు. మాణిక్ రావు కదం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. అప్పుడు మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించారు. తాజాగా పార్టీ మారి తిరిగి ఎన్సీపీలో చేరి మహారాష్ట్ర కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనతోపాటు నాందేడ్ షోలాపూర్‌లోని కేడర్ కూడా వెళ్లిపోయింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో అస్తిత్వం కాపాడుకుంటే చాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం తెలంగాణలోని లోక్‌సభ స్థానాలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. దీంతో మహారాష్ట్ర నేతలు కేసీఆర్‌ వైఖరిపై అసంత‌ృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను వీడిన మాణిక్‌రావు కదం ఎన్సీపీలో చేరారు. గత ఏడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపించగలిగారు. దీంతో మహారాష్ట్రలో ఇక నుంచి జరగబోయే ఎన్నికల్లో పోటీచేయాలని కేసీఆర్ భావించారు. కానీ తెలంగాణలో ఫలితాల తర్వాత గులాబీ బాస్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…