ఆదిలాబాద్ జిల్లాలో వింత పెళ్లి వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు.. గ్రామ పెద్దలు నుంచి కూడా అనుమతి లభించడంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలం ఘనపూర్‌కు చెందిన అర్జున్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ సమయంలోనే తన మేనత్తల కూతుళ్లను ప్రేమించాడు. ఉషారాణిది అదే గ్రామం కాగా.. సూర్యకళది శంభుగూడెం. మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు అర్జున్. ఇక ఈ క్రేజీ లవ్ స్టోరీలకు పెళ్లితో శుభం కార్డు వేయాలని భావించాడు. నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను, ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల ముందు ప్రతిపాదన ఉంచాడు. వారు గ్రామ పెద్దలు ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్‌కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈనెల 14న ఘన్‌పూర్‌లో సూర్యకళ, ఉషారాణిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: కరోనా టీకాలు, అపోహలు –వాస్తవాలు.. పూర్తి వివరాలు