ఇక 2023 సంవత్సరం ముగియబోతోంది. మరో పదిహేను రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాము. ఈ నేపథ్యంలో చాలా మంది గూగుల్‌లో రకరకాల వర్డ్స్‌ను సెర్ఛు చేస్తుంటారు. కానీ ఏడాదిలో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాలు తెరపైకి వస్తుంటాయి. దీంతో గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువ సెర్చ్ చేసిన పదాలు ఏంటో వెల్లడించింది. ఇక ఈ సంవత్సరం అందరిని ఆకర్షించిన అంశం చంద్రయాన్ 3. ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసింది. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రునిపై అడుగు పెట్టి రికార్డ్ సృష్టించింది. అయితే గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన పదాల్లో చంద్రయాన్-3 ఒకటి. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసినట్లు నివేదికలు వెల్లడయ్యాయి. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలు, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసినట్లు గూగుల్ నివేదిక వెల్లడించింది.
1. చంద్రయాన్-3 (Chandrayan-3)
2. కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Election Results)
3. ఇజ్రాయెల్ వార్తలు (Israe News)
4. సతీష్ కౌశిక్ (Satish Kaushik)
5. బడ్జెట్ 2023 (Budget 2023)
6. టర్కీ భూకంపం (Turkey Earthquake)
7. అతిక్ అహ్మద్ (Atiq Ahmed)
8. మాథ్యూ పెర్రీ (Matthew Perry)
9. మణిపూర్ వార్తలు (Manipur News)
10. ఒడిశా రైలు ప్రమాదం (Odisha Train Accident)
11. జీ20 అంటే ఏమిటి? (What is G20)
12. యూసీసీ అంటే ఏమిటి? (What is UCC)
13. చాట్‌జీపీటీ అంటే ఏమిటి? (What is Chat GPT)
14. హమాస్ అంటే ఏమిటి? (What is hamas)
15. 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత (What is on 28 September 2023)
16. చంద్రయాన్ 3 అంటే ఏమిటి (What is Chandrayaan 3)
17.సెంగోల్ అంటే ఏమిటి ? (What is Sengol)
18. ఇన్స్టాగ్రామ్ థ్రెడ్ అంటే ఏమిటి? (What is threads in Instagram)
ఇవే కాకుండా ఎన్నో పదాలు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి