WhatsApp: వాట్సాప్‌లో మరో వండర్ ఫీచర్.. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్.. అదెలా? ఇది చదవండి..

వాట్సాప్ విడుదల చేసిన కొత్త ఫీచర్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వాారా సాధారణ గ్రూప్ చాట్‌లకు ఈవెంట్‌లను సృష్టించవచ్చు. ఇంతకు ముందు ఈ ఫీచర్ కేవలం కమ్యూనిటీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు సాధారణ గ్రూప్ చాట్‌లకూ విస్తరించింది. యూజర్లు పరస్పరం సహకరించుకోవడానికి, సమన్వయం పెంచుకోవడానికి ఎంతో వీలుంటుంది.

WhatsApp: వాట్సాప్‌లో మరో వండర్ ఫీచర్.. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్.. అదెలా? ఇది చదవండి..
Whatsapp
Follow us

|

Updated on: Jun 30, 2024 | 6:22 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను తప్పనిసరిగా వినియోగిస్తారు. మన దేశంలో దీనిని ఉపయోగించే యూజర్లు కూడా చాలా ఎక్కువ. ఈ యాప్ ను సులభంగా ఉపయోగించే వీలుండడం దీనికి ముఖ్య కారణం. అలాగే వాట్సాప్ కూడా తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటుంది.

కొత్త ఫీచర్లు..

వాట్సాప్ యాజమాన్యం ఎప్పటి కప్పుడు యాప్ లో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వరుస అప్ డేట్ లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కొత్త ఫీచర్ తో మరోసారి ముందుకు వచ్చింది. గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌లను క్రియేట్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌లను సృష్టించడానికి యూజర్లను అనుమతిస్తుంది.

ప్రయోజనాలు ఇవే..

వాట్సాప్ విడుదల చేసిన కొత్త ఫీచర్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వాారా సాధారణ గ్రూప్ చాట్‌లకు ఈవెంట్‌లను సృష్టించవచ్చు. ఇంతకు ముందు ఈ ఫీచర్ కేవలం కమ్యూనిటీలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు సాధారణ గ్రూప్ చాట్‌లకూ విస్తరించింది. యూజర్లు పరస్పరం సహకరించుకోవడానికి, సమన్వయం పెంచుకోవడానికి ఎంతో వీలుంటుంది. ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఈవెంట్లను సృష్టించడం సాధ్యమవుతుంది. కొత్త ఫీచర్ తో యూజర్లు పేరు, వివరణ, తేదీ, ఐచ్ఛిక స్థానం, ఈవెంట్ వివరాలను ఇన్‌పుట్ చేయవచ్చు. వాయిస్, వీడియో కాల్ అవసరమో నిర్ధారించుకోవచ్చు.

గ్రూప్ చాట్‌లలో ఈవెంట్‌..

వాట్సాప్ బేటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. పేపర్ క్లిప్ ఎంపికలకు కొత్త అప్‌డేట్ ద్వారా మార్పులు చేసే అవకాశం ఉంది. పేపర్ క్లిప్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఇమేజ్, డాక్యుమెంట్, ఆడియో, కాంటాక్ట్, లొకేషన్ ను జోడించవచ్చు. అలాగే ఎంపికలను తీసివేయడానికి అప్లికేషన్ అనుమతి ఇస్తుంది. అప్‌డేట్ చేసిన తర్వాత ఈవెంట్‌ను సృష్టించడానికి అప్లికేషన్ మరో ఎంపికను జోడిస్తుంది. గ్రూప్ చాట్‌లోని సభ్యులు ఈవెంట్ ఆహ్వానాలను చూడవచ్చు, అలాగే ఆమోదించగలరు.

మెరుగైన సేవలు..

గ్రూప్ ను క్రియేట్ చేసిన వ్యక్తి ఈవెంట్ వివరాలను నవీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఈవెంట్లు కూడా ఎల్లప్పుడూ సురక్షితంగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తారు. అంటే కేవలం సంభాషణలో పాల్గొనే వ్యక్తులు మాత్రమే ఈవెంట్ వివరాలు, కమ్యూనికేషన్లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు.

దశల వారీగా..

గ్రూప్ చాట్‌ల కోసం ఈవెంట్ ఫీచర్ ను వాట్సాప్ దశల వారీగా విడుదల చేయనుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా అప్‌డేట్లను ఇన్‌స్టాల్ చేసే కొందరు వినియోగదారులకు అందుబాటులో ఉంది. మున్ముందు మరింత మంది యూజర్లను చేరుకోనుంది.

ఉపయోగాలు..

వాట్సాప్ కొత్త ఫీచర్ వినియోగదారులకు తమ మీడియా అప్‌లోడ్‌ల గురించి నిరంతరం తెలియజేస్తుంది. తద్వారా ఫైల్ షేరింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. మెసేజ్‌లను వేగంగా లోడ్ చేయడానికి ఎంతో సాయపడుతుంది. యాప్ యాక్టివ్‌గా ఓపెన్ కానప్పటికీ సాఫీగా మీడియా అప్‌లోడ్‌లను నిర్ధారిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..