Jobs: మౌస్‌ జిగ్లింగ్ అంటే ఏంటి.? ఈ కారణంగా ఉద్యోగులను తొలగించిన సంస్థ.

సిస్టమ్‌ ఐడల్‌ టైమ్‌.. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువసేపు స్క్రీన్‌ను వాడకుండా ఉంటే సిస్టమ్‌ వెంటనే స్లీప్‌ మోడ్‌లోకి వెళ్తుతుంది. దీని ఆధారంగా సదరు ఉద్యోగి పనిచేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని కంపెనీలు అంచనా వేసుకుంటాయి. అయితే వర్కింగ్ సమయంలో కంప్యూటర్‌ ఇలా స్లీప్‌ మోడ్‌లోకి వెళితే..

Jobs: మౌస్‌ జిగ్లింగ్ అంటే ఏంటి.? ఈ కారణంగా ఉద్యోగులను తొలగించిన సంస్థ.
Mouse Jiggling
Follow us

|

Updated on: Jun 16, 2024 | 11:44 AM

మౌజ్‌ జిగ్లింగ్ కార్పొరేట్‌ ప్రపంచంలో ఇప్పుడీ పదం ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. మౌస్‌ జిగ్లింగ్‌కు పాల్పడ్డారని అమెరికాకు చెందిన ఓ సంస్థ ఉద్యోగులను తొలగించింది. అమెరికాకు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌ సంస్థ వెల్స్‌ ఫార్గో మౌస్‌ జిగ్లింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో కొంత మంది ఉద్యోగులను తొలగించింది. అసలు మౌస్‌ జిగ్లింగ్ అంటే ఏంటి.? దీనివల్ల సంస్థలకు జరిగే నష్టం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సిస్టమ్‌ ఐడల్‌ టైమ్‌.. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువసేపు స్క్రీన్‌ను వాడకుండా ఉంటే సిస్టమ్‌ వెంటనే స్లీప్‌ మోడ్‌లోకి వెళ్తుతుంది. దీని ఆధారంగా సదరు ఉద్యోగి పనిచేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని కంపెనీలు అంచనా వేసుకుంటాయి. అయితే వర్కింగ్ సమయంలో కంప్యూటర్‌ ఇలా స్లీప్‌ మోడ్‌లోకి వెళితే.. ఉద్యోగి పని నుంచి తప్పించుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగానే కంపెనీలు తమ ఉద్యోగుల పని సమయాన్ని లెక్కిస్తాయి.

అయితే దీని నుంచి బయటపడేందుకు కొందరు ఉద్యోగులు ‘‘మౌస్ జిగ్లింగ్’’కు పాల్పడుతున్నారు. కంప్యూటర్‌ స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లకుండా నియంత్రించే పరికరమే ఈ మౌస్‌ జిగ్లింగ్‌. కంప్యూటర్‌ను నిత్యం యాక్టివేట్‌గా ఉండేందుకు ఈ పరికరాన్ని ఉద్యోగులు ఉపయోగిస్తున్నాయి. ఆన్‌ డ్యూటీ టైమ్‌లో బయటకు వెళ్లినా ఈ పరికరం ద్వారా సిస్టమ్‌ యాక్టివ్‌లో ఉండేలా చేస్తారు. ఇది నిరంతరంగా మౌస్‌ను కదిలిస్తుంటుంది. దీంతో ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ భావిస్తుంది.

ఈ మౌజ్‌ జిగ్లింగ్‌ను ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కంప్యూటర్‌లో మౌస్‌ జిగ్లింగ్‌కి సంబంధించి యాప్స్‌ ఉంటాయి. వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మౌజ్‌ జిగ్లింగ్ అనేది కేవలం సిస్టమ్‌ యాక్టివ్‌లో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఎలాంటి మెసేజ్‌లకు ప్రతిస్పందించవు. కాల్స్‌కు రిప్లై ఇవ్వవు. వీటి ఆధారంగా ఉద్యోగి ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles