23 June 2024
TV9 Telugu
ఇన్‌స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లకు మెరుగైన ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చింది.
తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు పని చేస్తుంది. యూజర్ల కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ యాప్ సాధారణ కాలింగ్ ఆప్షన్ అందించేందుకు కృషి చేస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలోనే ‘ఇన్ యాప్ డయలర్ ఫీచర్’ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది వాట్సాప్ సంస్థ.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ వాట్సప్‌లోనే ఉండి, సాధారణ కాల్స్ చేసుకునే వీలుంటుంది. కాలింగ్ కోసం యాప్ నుంచి ఎగ్జిట్ అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్ ఉందని తెలిపింది.యూజర్లు యాప్ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కాల్ చేసుకోవచ్చు.
యూజర్లు కాంటాక్ట్ బుక్‌ను యాడ్ చేసుకోవాల్సిన అవసరం సైతం లేదని చెప్పింది. యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ కనిపిస్తుంది.
దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాబీటా ఇన్ఫో వివరించింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్ కూడా అందుబాటులోకి
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని.. త్వరలోనే అందుబాటులోకి తీసువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.