‘పుష్పక్’ ప్రయోగంతో ఇస్రో హ్యాట్రిక్..!
TV9 Telugu
24 June 2024
మరో అరుదైన ఘనత సాధించిన ఇస్రో. పుష్పక్ అనే రీ యూజబుల్ లాంచ్ వెహికల్ (RLV)ని వరుసగా మూడోసారి ల్యాండ్ చేసిన ఇస్రో.
రీయూజబుల్ లాంచ్ వెహికిల్ ల్యాండింగ్ ఎక్స్‌పెరిమెంట్- RLV LEX సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం సక్సెస్.
దీనిపై మూడోసారి చేసిన ప్రయోగం కూడా మంచి విజయవంతమైనట్లు వెల్లడించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.
అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది.
అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్ ప్రయోగం.
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో చేసిన ప్రయోగం విజయవంతం. ఆకాశంలో 4.5 కి.మీ ఎత్తునుంచి దిగిన పుష్పక్.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం అంతరిక్ష నౌకలను పలుమార్లు వినియోగించుకునే సౌలభ్యంతో ఈ పుష్పక్ పని చేస్తుంది.
చినూక్ హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయిన పుష్పక్. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి