AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు దడపుట్టిస్తున్న గ్రీన్ లైట్.. మీ స్క్రీన్‌పై చెక్ చేసుకోండి

మీ ఫోన్ హ్యాకింగ్ కి గురైతే వెంటనే స్పందించడం ద్వారా నష్టపోకుండా ఉండొచ్చు. అందుకోసం మీ ఫోన్ లో మీరు చేయాల్సిన పని ఎప్పటికప్పుడు దానిపై ఓ కన్నేసి ఉంచడం. యాప్స్ ను వినియోగించే సమయంలో వాటికి పర్మిషన్స్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫోన్ స్క్రీన్ ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మీకు సంబంధం లేని ఏదైనా సిగ్నల్ తెరపై కనిపిస్తే చూసీచూడనట్టు వదిలేయకండి.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు దడపుట్టిస్తున్న గ్రీన్ లైట్.. మీ స్క్రీన్‌పై చెక్ చేసుకోండి
Smart Phone Hacking
Bhavani
| Edited By: |

Updated on: Feb 10, 2025 | 8:31 PM

Share

నిత్యం ఎక్కడో ఓ చోట ఈ సైబర్ నేరాల గురించి వింటూనే ఉన్నాం. రేపు మీరే ఆ బాధితులు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా సైబర్ అటాకర్లు పంజా విసురుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడేవారే వీరి మెయిన్ టార్గెట్. రోజంతా ఫోన్ వాడే వారిని టార్గెట్ చేసి మొత్తానికి బురిడీ కొట్టించేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. వీరి మోసాలను ఓ ట్రిక్ ద్వారా కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..

ఇలాంటి వారే టార్గెట్..

ఆన్ లైన్ పేమెంట్స్, షాపింగ్ బిల్స్, టికెట్ బుకింగ్స్ అంటూ నిత్యం ఏదో ఒక ట్రాన్ సాక్షన్ చేసేవారు ఈ వార్త మిస్సవ్వకండి. ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే హ్యాక్ అయ్యి ఉండొచ్చు. లేదంటే కేటుగాళ్లకు మీరు టార్గెట్ గానూ ఉండొచ్చు. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయి ఉంటే ఈ చిన్న ట్రిక్ ద్వారా కనిపెట్టేయొచ్చు.

ఇలా కనిపిస్తే డేంజర్లో ఉన్నట్టే..

చాలా మంది మీ డబ్బులు కాజేయడానికి ముఖ్యంగా చేసే పని మీ సీక్రెట్ పాస్ వర్డ్స్ ను, డేటాను దొంగిలించడమే. ఇందుకు వీరి దగ్గరున్న ఆయుధం మీ స్క్రీన్ ను మీకు తెలియకుండా రికార్డ్ చేయడమే. ఇలాగే మీ వ్యక్తిగత డేటాను దొంగలించి మీ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడమో లేక పాస్ వర్డ్ చోరీ చేసి అకౌంట్ ఖాళీ చేయడమో చేస్తుంటారు. మీ ఫోన్ హ్యాకింగ్ కు గురైతే మీ ఫోన్ స్క్రీన్ పై గ్రీన్ కలర్ లో ఒక చుక్క కనపడుతుంది. ఇది మైక్ లేదా కెమెరా ఆన్ చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫోన్ రికార్డు అవుతుందని తెలిపే సంకేతం. మీరు ఇలా కనిపించినప్పుడు లైట్ తీసుకోకుండా వెంటనే స్పందించి అలెర్టవ్వండి. మీ సెక్యూరిటీ సెట్టింగ్స్ ను సెట్ చేసి యాక్సెస్ ను పరిమితం చేయండి. కెమెరాకు, మైక్ కు ఏదైనా కొత్త యాప్ లు యాక్సెస్ ఇచ్చి ఉన్నాయా అనే విషయం చెక్ చేసుకోండి.

Follow Us
మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440
మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440
కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'
కాకినాడ AE కేసులో ట్విస్ట్‌.. 'నా భర్తకు విషం ఇచ్చి వాడే చంపాడు'
సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే
సరికొత్త మహీంద్రా స్కార్పియో పికప్ ట్రక్‌ ధర, ఫీచర్లు ఇవే
94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..
94 ఫోర్లు, 6 సిక్సర్లతో 1107 పరుగులు.. క్రికెట్ హిస్టరీలోనే..
డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్
డెబ్యూ మ్యాచ్‌లోనే చెత్త రికార్డు మూటగట్టుకున్న లంక బౌలర్
మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు
మార్కెట్‌లో సంచలనానికి స్కోడా స్లావియా రెడీ.. పూర్తి వివరాలు
కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!
కియారా కాదు.. రామ్ చరణ్-సుక్కూ మూవీలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. మళ్లీ భారీగా పెరుగుతున్న రేట్లు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
ఇండియన్‌ మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్‌ ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీలు
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..
రోజుకు కేవలం రూ.195 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..