
స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ X300 అల్ట్రాతో ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీకి సిద్ధమవుతోంది. విశ్వసనీయ లీకుల ప్రకారం 16GB RAM, 1TB స్టోరేజ్‌తో వచ్చే ఈ ఫోన్ ధర యూరప్‌లో EUR 2,000 (దాదాపు రూ.2.19 లక్షలు)గా ఉండవచ్చని సమాచారం. ఈ ధరతో ఇది ఐఫోన్ టాప్ మోడల్స్, అలాగే శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్‌షిప్‌లతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది. లాంచ్ టైమ్‌లైన్ విషయంలో స్పష్టత లేకపోయినా, ఈ పరికరం 2026 ఏప్రిల్ చివరలో లేదా మే ప్రారంభంలో అధికారికంగా విడుదల కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కంపెనీ ఇప్పటివరకు ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు.
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది దాని కెమెరా సెటప్. 200MP ప్రధాన సెన్సార్‌తో పాటు మరో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరాతో ఇది ఫోటోగ్రఫీపై దృష్టి సారించిన పరికరంగా నిలుస్తోంది. 3.5x ఆప్టికల్ జూమ్‌తో పాటు 150x డిజిటల్ జూమ్ కూడా అందించబడుతుంది. అదనంగా, ప్రత్యేక ఫోటోగ్రఫీ కిట్ ద్వారా ఫోన్‌ను DSLR తరహా అనుభూతి కలిగించేలా రూపొందించడం విశేషం. ఈ కిట్‌తో ధర మరింత పెరిగి రూ. 2.9 లక్షల వరకు చేరే అవకాశం ఉంది.
హార్డ్‌వేర్ పరంగా కూడా ఈ ఫోన్ శక్తివంతంగా ఉంటుంది. 6.82 అంగుళాల 2K AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 16GB RAM, 1TB స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. 6,600mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది. యూరోప్‌లో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయని సమాచారం. కొనుగోలుదారులకు స్క్రీన్ రక్షణ, విస్తృత వారంటీలు వంటి ప్రయోజనాలు అందిస్తున్నాయి. గ్లోబల్ లాంచ్ అనంతరం ఇది భారత మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి