HMD Feature Phones: బేసిక్ ఫోన్లలోనూ యూపీఐ లావాదేవీలు.. ఏకంగా 18 రోజుల బ్యాటరీ బ్యాకప్..

హెచ్ఎండీ 110, 105 ఫీచర్ ఫోన్లను ఇటీవల దేశ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇవి ఆ కంపెనీ మొదటి సొంత బ్రాండెడ్ ఫోన్లు. ఇవి ఫీచర్ ఫోన్లయినా వీటిని మల్టీ మీడియా ఫీచర్లతో రూపొందించారు. అలాగే అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో వాయిస్ అసిస్టెన్స్, పెద్ద డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ యూపీఐ యాప్, 18 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

HMD Feature Phones: బేసిక్ ఫోన్లలోనూ యూపీఐ లావాదేవీలు.. ఏకంగా 18 రోజుల బ్యాటరీ బ్యాకప్..
Hmd 110 Feature Phone
Follow us

|

Updated on: Jun 15, 2024 | 8:22 PM

దేశంలో స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న సమయంలో హెచ్ఎండీ సంస్థ రెండు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 పేరుతో వాటిని ఆవిష్కరించింది. ఇన్ బిల్ట్ యూపీఐ సపోర్టుతో వీటిని తీసుకువచ్చింది. ఈ పోన్లను ఉపయోగించి వినియోగదారులు సురక్షితంగా డబ్బు లావాదేవీలు కూడా జరపవచ్చు. దాదాపు 18 రోజులు బ్యాటరీ బ్యాకప్ వీటి అదనపు ప్రత్యేకత. ఫీచర్ ఫోన్ల లో బటన్లు ఉంటాయి. చిన్న డిస్ ప్లే ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు రాకముందు మనమందరం వాడిన ఫోన్లు అని చెప్పవచ్చు.

ఎంతో ఉపయోగం..

ఈ రోజుల్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే దాదాపు రూ. 15వేల నుంచి రూ.20 వేలు ఖర్చుపెట్టాలి. అంత డబ్బు పోసి కొన్నా కొందరు వాటిలోని యాప్ లన్నింటినీ ఉపయోగించరు. ముఖ్యంగా గ్రామాలలో నివసించే పెద్దవారికి ఇవి ఉపయోగంగా ఉండవు. కొత్తగా విడుదలైన హెచ్ఎండీ ఫీచర్ ఫోన్లు వారి అవసరాలకు సరిపోతాయి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలకు అనుమతి ఉండడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.

మార్కెట్ లోకి విడుదల..

హెచ్ఎండీ 110, 105 ఫీచర్ ఫోన్లను ఇటీవల దేశ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇవి ఆ కంపెనీ మొదటి సొంత బ్రాండెడ్ ఫోన్లు. ఇవి ఫీచర్ ఫోన్లయినా వీటిని మల్టీ మీడియా ఫీచర్లతో రూపొందించారు. అలాగే అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిలో వాయిస్ అసిస్టెన్స్, పెద్ద డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ యూపీఐ యాప్, 18 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. హెచ్ఎండీ 110 సెట్ లో వెనుక కెమెరా యూనిట్ కూడా ఉంది.

ధరల వివరాలు..

హెచ్ఎండీ 110 ఫోన్ రూ.1, 119 అలాగే 105 ఫోన్ రూ.999కు అందబాటులో ఉన్నాయి. హెచ్ఎండీ.కామ్, ఇ-కామర్స్ సైట్లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో జూన్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. 110 ఫోన్ బ్లాక్, గ్రీన్ రంగులలో, అలాగే 105 ఫోన్ బ్లాక్, బ్ల్యూ, పర్పుల్ రంగులలో ఆకట్టుకుంటున్నాయి.

ప్రత్యేకతలు..

ఈ రెండు ఫోన్లలో ఫోన్ ట్రాకర్, ఆటో కాల్ రికార్డింగ్, ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో తదితర ప్రత్యేకతలున్నాయి. 105 మోడల్ లో డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు, 110 వెనుక కెమెరా సెన్సార్‌ ఉన్నాయి. అయితే వీటిలోని కెమెరా యూనిట్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

యూపీఐ లావాదేవీలు..

ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు బాగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి వీటిని చాలా సులభం చేసుకోవచ్చు. జేబులో డబ్బులు ఉండాలనే నియమం లేదు. చిల్లర సమస్యలు ఉండవు. చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ల వరకూ యూపీఐ లావాదేవీలను అనుమతిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఇప్పుడు హెచ్ఎండీ కంపెనీ తన 110, 105 ఫోన్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) అప్లికేషన్‌ను అమర్చింది. వినియోగదారులు సురక్షితంగా డబ్బు లావాదేవీలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

సూపర్ బ్యాకప్..

సూపర్ బ్యాటరీ బ్యాకప్ వీటికి అదనపు ప్రత్యేకత. ఈ రెండు ఫోన్లలో 1,000ఎంఏహెచ్ బ్యాటరీలను అమర్చారు. ఇది దాదాపు 18 రోజుల వరకు స్టాండ్‌బై సమయం అందిస్తాయి. ఇతర స్పెసిఫికేషన్లపై సమాచారం లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..