Truecaller: ట్రూ కాలర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై డెస్క్‌టాప్‌లోనూ..

|

Apr 12, 2024 | 3:09 PM

ట్రూ కాలర్ యాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ట్రూ కాలర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పలు ఆసక్తికరమైన...

Truecaller: ట్రూ కాలర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై  డెస్క్‌టాప్‌లోనూ..
Truecaller
Follow us on

ట్రూ కాలర్ యాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ యాప్‌ను ఉపయోగిస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ట్రూ కాలర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పలు ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకొచ్చిన ట్రూకాలర్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పీచర్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఏంటీ ఫీచర్‌, దీనిని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ట్రూ కాలర్‌ అనగానే స్మార్ట్ ఫోన్‌లో మాత్రమే ఉపయోగిస్తాం అని తెలుసు. అయితే ఇకపై ట్రూ కాలర్‌ను ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌లో కూడా ఉపయోగించవచ్చు. ట్రూకాలర్‌ ఫర్‌ వెబ్‌ పేరుతో తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఇకపై యూజర్లు డెస్క్‌టాప్‌లో ట్రూ కాలర్‌ను ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఈ విషయమై ట్రూ కాలర్‌ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. ట్రూకాలర్ వెబ్ తో రియల్ టైమ్ లో తమ డెస్క్ టాప్, పీసీ, ల్యాప్ టాప్ ల్లో తమ ట్రూ కాలర్ ఐడీ సింక్‌ చేసుకోవచ్చు.

యూజర్లకు ఎస్ఎంఎస్, చాట్ మిర్రరింగ్, నంబర్ సెర్చ్, కాల్ నోటిఫికేషన్ వంటి ఫీచర్స్‌ ఇందులో లభిస్తాయి. ఇక ట్రూ కాలర్‌ను డెస్క్‌టాప్‌కు చాలా సులభంగా లింక్‌ చేసుకోవచ్చు. ట్రూకాలర్‌ ఐడీ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌తో డెస్క్ టాప్ లో కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు. ఇందుకోసం ముందుగా ట్రూకాలర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి. మెసేజ్‌లకు వెళ్లాలి. అంనతరం అక్కడ పై కనిపించే మూడు డాట్స్‌పై క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే “ట్రూకాలర్ ఫర్ వెబ్”ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం లింక్‌ డివైజ్‌పై ట్యాప్ చేయాలి. వెంటనే స్కానర్‌ ఓపెన్ అవుతుంది. దీంతో మీ డెస్క్‌టాప్‌ స్క్రీన్‌పై కనిపించే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..