One Plus Ear Buds: బయటి శబ్దాలు వినపడవు.. సూపర్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో.. ధరెంతో తెలుసా?

|

Sep 01, 2021 | 5:49 PM

వన్‌ప్లస్ తన ఇయర్‌బడ్స్ బడ్స్ ప్రోని విడుదల చేసింది. ఆగస్టు 26 నుండి కంపెనీ తన అమ్మకాలను ప్రారంభించింది. దీనికి మంచి స్పందన లభిస్తోంది.

One Plus Ear Buds: బయటి శబ్దాలు వినపడవు.. సూపర్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటున్న వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో.. ధరెంతో తెలుసా?
One Plus Ear Buds Pro
Follow us on

One Plus Ear Buds: వన్‌ప్లస్ తన ఇయర్‌బడ్స్ బడ్స్ ప్రోని విడుదల చేసింది. భారతదేశంలో, కంపెనీ దాని ధరను 9990 రూపాయలుగా ఉంచింది. (ఈ ధర ఇతర దేశాల్లో మరింత ఎక్కువ). ఆగస్టు 26 నుండి కంపెనీ తన అమ్మకాలను ప్రారంభించింది. దీనికి మంచి స్పందన లభిస్తోంది. వినియోగదారులు అమెజాన్ ఇండియాతో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్. వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ నుండి OnePlus బడ్స్ ప్రోని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి, నిగనిగలాడే వైట్, మాట్టే బ్లాక్ కలర్ ఎంపికలలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో లభిస్తోంది. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం..

నాయిస్ రిడక్షన్..
ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకత నాయిస్ రిడక్షన్. అంటే ఎటువంటి శబ్దాలనూ వినిపించానీయదు. కేవలం కాల్స్ లో వాయిస్.. ప్లే అవుతున్న పాటలు తప్ప ఇతర రకాల శబ్దాలు ఏవీ వినిపించవు. అందువల్ల సంగీతం.. కాల్స్ లో స్పష్టత ఉంది. ఇది మూడు మోడ్‌లతో వస్తుంది – ఎక్స్‌ట్రీమ్, ఫెంట్ ,స్మార్ట్. శఈ ఇయర్ బడ్స్ 25dB వరకు శబ్దాన్ని తగ్గిస్తాయి. ఇది కాకుండా, బడ్స్‌లో ఇచ్చిన స్మార్ట్ మోడ్ ఆటోమేటిక్‌గా చుట్టుపక్కల సౌండ్‌ను తగ్గిస్తుంది.

కాలింగ్ కోసం, ప్రీసెట్ మోడ్‌తో వచ్చే మూడు మైక్రోఫోన్‌లు వాటిలో అమర్చారు. ఈ ప్రీసెట్ మోడ్‌లు సాఫ్ట్‌వేర్ అల్గోరిథంల సహాయంతో అవాంఛిత శబ్దాన్ని తగ్గిస్తాయి. బడ్స్ ప్రోతో వచ్చే ఛార్జింగ్ కేసు IPX4 రేటింగ్‌తో వస్తుంది.. కనుక కొంత వరకు జలనిరోధితంగా ఉంటుంది. అదే సమయంలో, బడ్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. దాని IP55 రేట్ కలిగిన బిల్డ్ నాణ్యత కారణంగా, ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది.

OnePlus బడ్స్ ప్రో ప్రత్యేక ఫీచర్లు

డైనమిక్ డ్రైవర్లు: బడ్స్ ప్రో గొప్ప సౌండ్ కోసం 11mm డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది. వినియోగదారులకు అత్యుత్తమ ఆడియో నాణ్యతను అందించడానికి, కంపెనీ డాల్బీ అట్మోస్ మద్దతును కూడా అందిస్తోంది. ఈ ఇయర్‌బడ్‌లు గేమింగ్‌కు గొప్పగా ఉంటాయి. ఎందుకంటే అవి 94 ఎంఎస్ లటెన్సీ రేటును అందిస్తాయి.
బ్యాటరీ: దాని బ్యాటరీ జీవితానికి సంబంధించి 38 గంటల బ్యాకప్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో, ప్రతి ఇయర్‌బడ్‌ల బ్యాటరీ 10 గంటల వరకు ఉంటుంది, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.
వాటర్‌ప్రూఫ్ కేస్: దీని ఛార్జింగ్ కేసు నీటి నిరోధకత కొరకు IPX4 ధృవీకరణ పొందింది. నీరు, ధూళి నిరోధకత కోసం ఇయర్‌బడ్‌లు IP55 ధృవీకరణ పొందాయి. OnePlus తన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు మొదటిసారిగా జెన్ మోడ్‌ని జోడించింది.

Also Read: Jio phone next: చౌకైన 4జీ జియో ఫోన్ నెక్స్ట్ బంపరాఫర్.. కొద్దిగా చెల్లిస్తే చాలు మీ సొంతం..బుకింగ్స్ ఎప్పటినుంచి అంటే..

New Vehicles in September: కొత్త కారు కొందామనుకుంటున్నారా? సెప్టెంబర్ లో సరికొత్తగా రానున్న వాహనాలు ఇవే.. ఓ లుక్కేయండి!