Smart Phone: కొత్త స్మార్ట్‌ కొనుగోలు చేశారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. భారీ నష్టం తప్పదు..!

| Edited By: Ravi Kiran

Sep 24, 2023 | 9:00 PM

Smart Phone Using Tips: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కామన్ అయిపోయింది. మునుపటిలా ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాదు.. అన్ని అవసరాలకు ఫోన్‌నే వినియోగిస్తున్నారు. బ్యాంకింగ్, వినోదం, పరిశోధనలు, షాపింగ్.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే వస్తుంది. ఒక్కమాట చెప్పాలంటే..

Smart Phone: కొత్త స్మార్ట్‌ కొనుగోలు చేశారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. భారీ నష్టం తప్పదు..!
Smartphone Configuration
Follow us on

Smart Phone Using Tips: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ కామన్ అయిపోయింది. మునుపటిలా ఫోన్ కాల్స్ చేయడానికి మాత్రమే కాదు.. అన్ని అవసరాలకు ఫోన్‌నే వినియోగిస్తున్నారు. బ్యాంకింగ్, వినోదం, పరిశోధనలు, షాపింగ్.. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే వస్తుంది. ఒక్కమాట చెప్పాలంటే.. ప్రపంచం అంతా మన అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ ఫోన్‌లోనే ఉంది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌తో సౌకర్యాలు మరింత విస్తృతమయ్యాయి. దాంతో పాటే.. ప్రమాదం కూడా చాలా రెట్లు పెరిగింది. స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఓసారి చూద్దాం..

స్మార్ట్ ఫోన్‌ల కారణంగా సైబర్ స్కామ్‌ల కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా డబ్బును బదిలీ చేస్తుంటారు. ఇది స్కామర్‌లకు ఒక ఆయుధంగా మారుతుంది. సైబర్ నేరస్తులు ప్రజల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI ID తెలుసుకుని ప్రజలను దారుణంగా మోసం చేస్తుంటారు. మరి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

  1. Android స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడానికి, Gmail అకౌంట్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాని సహాయంతోనే మీరు అన్ని సేవలను యాక్సెస్ చేయగలుగుతారు.
  2. అయితే, Gmail పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవద్దు. ఎందుకంటే దాని సహాయంతో మీ ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల డేటాను యాక్సెస్ చేయవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. మీ ఫోన్‌కు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి అనుమానాస్పద లింక్ వచ్చినట్లయితే.. దానిపై క్లిక్ చేయొద్దు. బహుశా ఇది స్కామర్స్ పంపిన సందేశం కావొచ్చు.
  5. మీ OTPని ఇతరులతో పంచుకోకూడదు.
  6. ఫోన్ లాక్ చేసి ఉంచండి. పిన్ లేదా ప్యాటర్న్‌ను సెట్ చేసుకోవాలి. అయితే, మీ పిన్, ప్యాటర్న్‌ను ఇతరులతో అస్సలు షేర్ చేసుకోవద్దు.
  7. మొబైల్‌లో బ్లోట్‌వేర్‌లు కూడా వస్తాయి. వాటిపై క్లిక్ చేయవద్దు. ఎందుకంటే సైబర్ నేరస్తులు మీ డేటాను సేకరించి, తర్వాత దానిని ప్రకటనల కోసం ఉపయోగిస్తారు.
  8. బ్యాంకింగ్ వివరాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్మార్ట్‌ఫోన్‌లో అన్ని ఫీచర్స్ గురించి తెలిసేంత వరకు బ్యాంకింగ్ సేవలను ఉపయోగించొద్దు.
  9. ఏదైనా యాప్‌ని ప్లే స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పాటలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి.. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించండి.
  10. అవసరం లేకుంటే, ఇంటర్నెట్, ఇతర ముఖ్యమైన సెట్టింగ్‌లను ఆఫ్ చేయండి. ఇది స్కామర్ల ప్రవేశాన్ని కష్టతరం చేస్తుంది.
  11. మీరు వాట్సాప్‌ని ఉపయోగిస్తే, గుర్తు తెలియని కాల్స్ పట్ల గురించి అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ కూడా వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..