
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం ఇప్పుడు చాలా కామన్. పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వారికి కనీసం 10 ఫొటోలైన అప్‌లోడ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఫోటోని ఉపయోగించి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామంటూ బెదిరించే సైబర్ క్రైమ్ కేసులను రోజు చూస్తూనే ఉంటాం. లేదా వారికి తెలియకుండానే వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర ఫొటోలను తయారుచేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అప్‌లోడ్ చేసే ఇంకొంతమందిని చూస్తుంటాం..
ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేయడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మహిళలు చాలామంది ఉన్నారు. బ్లాక్ మెయిల్ చేసే ముఠాలకు డబ్బులు ఇవ్వలేక పోలీసులను ఆశ్రయించలేక ప్రాణాలను వదిలేస్తున్న మహిళలకు అండగా మేమున్నామంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్‌సైట్ రూపంలో ముందుకు వచ్చింది. మీ ఫోటోలను ఎక్కడైనా మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తే ఈ వెబ్‌సైట్ వాటిని డిలీట్ చేయిస్తుంది. Stopncii.org అనే వెబ్‌సైట్ సైబర్ క్రైమ్ బారిన పడుతున్న మహిళలకు ఒక వెలుగు దివ్వలా కనిపిస్తుంది.
మీ ఫోటోలను మార్ఫింగ్ చేసినప్పుడు కచ్చితంగా మొహం, ముక్కు, చెవులు, చెంపలు, వెంట్రుకలు ఇలా కొన్ని భాగాలను మాత్రం ఒరిజినల్‌వే ఉంచుతారు. లేదంటే ఆ ఫోటోని ఎవరు గుర్తుపట్టరు. ఈ ఒరిజినల్ ఫోటోలకు అదనంగా గ్రాఫిక్స్‌లో ఇతర భాగాలను అతికించి మార్ఫింగ్ చేస్తారు. సో ఈ వెబ్‌సైట్ మీ ఒరిజినల్ ఫోటో పార్ట్స్ తో ఒక ఫింగర్ ప్రింట్ తయారు చేస్తుంది. అది అప్లై చేయగానే వెంటనే మీ మార్ఫింగ్ ఫోటోలన్నీ దొరికిపోతాయి. ఇప్పటి వరకు దీని ద్వారా పదివేల మందికి పైగా ఈ వెబ్‌సైట్ సహాయం చేసింది. ఇకపై మార్ఫింగ్ ఫొటోలకు ఇక అస్సలు భయపడాల్సిన అవసరం లేదు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..