రూ.20 వేల బడ్జెట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి!

Oppo K14 5G స్మార్ట్‌ఫోన్ రూ.19,999 ధరతో బడ్జెట్ సెగ్మెంట్‌లో విడుదలైంది. 7000mAh భారీ బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో ఇది రోజువారీ పనులు, గేమింగ్‌కు అద్భుతమైన పనితీరు అందిస్తుంది. IP69 రేటింగ్‌తో మన్నికైన డిజైన్‌తో కూడిన ఈ ఫోన్, ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి సరైన ఎంపిక.

రూ.20 వేల బడ్జెట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి!
Oppo K14 5g

Updated on: May 11, 2026 | 9:02 AM

బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను ఆకట్టుకునేందుకు Oppo K14 5G మార్కెట్లోకి వచ్చింది. రూ.19,999 ధరతో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 120Hz AMOLED డిస్‌ప్లే, భారీ 7,000mAh బ్యాటరీ, MediaTek Dimensity 6300 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, రోజువారీ పనులకు స్మూత్ పనితీరు కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా కనిపిస్తోంది.

డిజైన్ పరంగా Oppo K14 5G ఆకర్షణీయంగా ఉంది. వెనుక భాగంలో ఇచ్చిన డైమండ్ ప్యాటర్న్ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ చేతిలో బరువుగా అనిపించదు. పాలికార్బోనేట్ బాడీతో పాటు IP69 రేటింగ్ కూడా ఉండటంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి అదనపు రక్షణ లభిస్తుంది. పనితీరు విషయానికి వస్తే ఈ ఫోన్‌లోని మెడియటేక్ డిమెంసిటీ 6300 చిప్‌సెట్, 8GB RAM కలయిక రోజువారీ పనులను చాలా సులభంగా నిర్వహిస్తుంది. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ మాత్రమే కాకుండా BGMI, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ మొబైల్‌ వంటి గేమ్స్ కూడా సాఫీగా ఆడవచ్చు. అధిక వేడి లేదా లాగ్ సమస్యలు పెద్దగా కనిపించవు.

కెమెరా విభాగంలో 50MP ప్రధాన కెమెరా సాధారణ వినియోగానికి సరిపోతుంది. మంచి వెలుతురులో తీసిన ఫోటోలు స్పష్టంగా, రంగుల మేళవింపుతో కనిపిస్తాయి. అయితే తక్కువ వెలుతురులో కెమెరా పనితీరు సాధారణంగానే ఉంటుంది. 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉన్నా, 4K వీడియో సదుపాయం లేదు. 8MP సెల్ఫీ కెమెరా వీడియో కాల్స్, సాధారణ సెల్ఫీలకు సరిపోతుంది. ఈ ఫోన్‌లోని 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 24 గంటలకు పైగా బ్యాకప్ అందించే సామర్థ్యం ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ పూర్తి ఛార్జ్ కావడానికి కొంత సమయం పడుతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us