కొత్త కలర్​, అదిరే లుక్‌తో వన్​ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3ఆర్​.. ధర, ఫీచర్లతోపాటు ఆఫర్లు కూడా కేకపెట్టిస్తాయి

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వన్‌ప్లస్ భారత మార్కెట్లో తన పాపులర్ OnePlus Nord Buds 3r ఇయర్‌బడ్స్‌కు కొత్త కలర్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే Aura Blue, Ash Black రంగుల్లో లభిస్తున్న ఈ బడ్స్ ఇప్పుడు ఆకట్టుకునే Jade Mist షేడ్‌లో అందుబాటులోకి వచ్చాయి. కొత్త లుక్‌తో పాటు బలమైన బ్యాటరీ బ్యాకప్, స్మార్ట్ ఫీచర్లు వీటి ప్రత్యేకత.

కొత్త కలర్​, అదిరే లుక్‌తో వన్​ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3ఆర్​.. ధర, ఫీచర్లతోపాటు ఆఫర్లు కూడా కేకపెట్టిస్తాయి
Oneplus Nord Buds 3r

Updated on: Oct 04, 2026 | 8:30 PM

బడ్జెట్‌లో మంచి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త వేరియంట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మ్యూజిక్, గేమింగ్, కాల్స్ కోసం ఉపయోగించుకునేలా పలు ఫీచర్లను ఇందులో అందించారు. రూ.1,999 స్టాండర్డ్ ధర ఉన్నప్పటికీ పండగ సీజన్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతోంది. కొత్త Jade Mist వేరియంట్‌లో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం.

రూ.1,599కే కొత్త Jade Mist కలర్

OnePlus Nord Buds 3r కొత్త Jade Mist వేరియంట్ ధరను రూ.1,999గా నిర్ణయించారు. అయితే పండగ సీజన్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లతో కలిపి వీటిని కేవలం రూ.1,599కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త కలర్ వేరియంట్ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఇయర్‌బడ్స్‌ను Amazon, Flipkart, Myntra, Blinkitతో పాటు OnePlus అధికారిక వెబ్‌సైట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఉన్న Aura Blue, Ash Black రంగుల జాబితాలోకి ఇప్పుడు Jade Mist చేరింది. సాఫ్ట్ గ్రీన్ షేడ్‌లో ఉండే ఈ కొత్త రంగు బడ్స్‌కు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.

బడ్స్‌లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ బ్యాకప్. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే సుమారు 8 గంటల వరకు మ్యూజిక్ వినే అవకాశం ఉంటుంది. బ్యాటరీ దీర్ఘకాలిక పనితీరు కోసం ప్రత్యేక సర్టిఫికేషన్ కూడా ఉంది.

గేమింగ్, కాల్స్‌కు ప్రత్యేక ఫీచర్లు

సౌండ్ కోసం 12.4mm Titanium-plated Dynamic Drivers అందించారు. OnePlus Sound Master EQ సపోర్ట్‌తో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా ఆడియో అనుభూతిని ఆస్వాదించవచ్చు. దీంతో మ్యూజిక్ వినే సమయంలో బలమైన సౌండ్‌ను అందించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. కనెక్టివిటీ విషయంలో లేటెస్ట్ Bluetooth సపోర్ట్‌తో పాటు Dual-Device Connection ఫీచర్ ఉంది. దీని ద్వారా ఒకేసారి రెండు పరికరాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. Google Fast Pair సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

గేమింగ్ కోసం Low-Latency Gaming Mode ఇచ్చారు. కాల్స్ సమయంలో చుట్టుపక్కల శబ్దం ప్రభావాన్ని తగ్గించేందుకు AI Call Noise Cancellation టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో గేమింగ్‌తో పాటు వాయిస్ కాల్స్ సమయంలోనూ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక Dust, Water Resistance రేటింగ్‌తో పాటు AI Translation, Find My Earbuds వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్, 54 గంటల బ్యాటరీ బ్యాకప్, గేమింగ్, కాల్స్‌కు ఉపయోగపడే ఫీచర్లతో OnePlus Nord Buds 3r Jade Mist కొత్త ఆప్షన్‌గా నిలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us