Nothing Phone 2a Plus: భార‌త‌ మార్కెట్లోకి న‌థింగ్ కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్స్ ఎలా ఉండ‌నున్నాయంటే..

న‌థింగ్ ఫోన్ 2ఏ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1080×2412 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ప్రొటెక్ష‌న్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు...

Nothing Phone 2a Plus: భార‌త‌ మార్కెట్లోకి న‌థింగ్ కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్స్ ఎలా ఉండ‌నున్నాయంటే..
Nothing Phone 2a Plus
Follow us

|

Updated on: Aug 03, 2024 | 9:59 AM

లండ్‌న్‌కు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ న‌థింగ్ భార‌త మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. న‌థింగ్ ఫోన్ 2ఏ ప్ల‌స్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. న‌థింగ్ సిరీస్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని ఫోన్‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించిన నేప‌థ్యంలో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంత‌కీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? ధ‌ర ఎంత‌.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

న‌థింగ్ ఫోన్ 2ఏ ప్ల‌స్ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1080×2412 పిక్సెల్స్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ప్రొటెక్ష‌న్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌ను ఇచ్చారు. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమ‌రీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

క‌నెక్టివిటీ విష‌యానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5జీ, 4జీఎల్టీఈ, వై-ఫై.6, వై-ఫై.6 డైరెక్ట్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్ 360-డిగ్రీ యాంటీనా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. ఇందులో డ‌స్ట్ అండ్ వాట‌ర్ రెసిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇచ్చారు. , నోటిఫికేషన్లను గుర్తించేందుకు ఎల్ఈడీ ఫిల్డ్ అరే (గ్ల్యఫ్ ఇంటర్ ఫేస్) ను అందించారు.

50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాట‌రీని అందించారు. ఒక్క‌సారి చార్జ్ చేస్తే 40 గంట‌ల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం ఇస్తుంద‌ని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్ కేవ‌లం 56 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. ధ‌ర విష‌యానికొస్తే ఈ సఫోన్ బేసిక్ వేరియంట్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ రూ.27,999, టాప్ ఎండ్ వర్షన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999 గా నిర్ణ‌యించారు. అమెజాన్‌లో ఈ నెల 7వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

మ‌రిన్ని టెక్నాల‌జీ వార్త‌ల కోసం క్లిక్ చేయండి…