ఇండియన్ నేవీకి అత్యాధునిక సబ్‌మెరైన్స్.. బలమెంత..?
TV9 Telugu
31 July 2024
సముద్రగర్భంలో భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో సన్నాహాలు జరుగుతున్నాయి.
మూడు అత్యాధునిక కల్వరి క్లాస్ సబ్ మెరైన్లను కొనుగోలు చేయనున్న భారత్. ఈ ఏడాది చివరి నాటికి నౌకాదళానికి మూడు జలాంతర్గాముల తయారీ ప్రారంభం.
మజ్‌గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మిస్తున్న జలాంతర్గాములు. వీటి నిర్మాణంలో ఫ్రెంచ్ నావల్ గ్రూప్ సహాయం.
60 శాతం భారతీయ కంటెంట్‌తో తయారీ. ఈ జలాంతర్గాముల పొడవు గతంలోని జలాంతర్గాముల కంటే 10 మీటర్లు ఎక్కువ.
ఇంధన సెల్ ఆధారిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్‌ను దీనిలో అమర్చవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీల ఏర్పాటు.
మెరుగైన నావిగేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇన్‌స్టాల్. జలాంతర్గాములకు శత్రువు రాడార్‌ను మోసగించే శక్తి.
అధునాతన అకౌస్టిక్ సైలెన్సింగ్ టెక్నాలజీని ఇందులో అమర్చనున్నారు. అంటే నీటిలో నడుస్తున్నప్పుడు శబ్దం చేయదు.
జలాంతర్గామిని నిర్మించడానికి కనీసం ఆరేళ్లు పడుతుంది. BEL ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి