
బయటకు వెళ్లినప్పుడు లేదా ప్రయాణం చేసే సమయంలో ఫోన్ ఛార్జింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఛార్జ్ చేసుకోవడానికి అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. దీంతో ప్రయాణాలు చేసే సమయంలో పవర్ బ్యాంక్ ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పవర్ బ్యాంక్ ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేసుకుంటారు. అయితే పవర్ బ్యాంక్‌కు ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలనేది ఎవరికి తోచదు. కానీ ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. పవర్ బ్యాంక్ లేకపోయినా, మీ దగ్గర్లలో ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా మీ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియని ఈ ట్రిక్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
అవును.. ప్రస్తుతం వచ్చే ఫోన్లలో అనేక అద్బుత ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. అందులో ఒకటి ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకునే ఫీచర్. చాలా కంపెనీలు ఇలాంటి ఫీచర్లు అందించే ఫోన్లను తీసుకొస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో 7000 నుండి 9000mAh బ్యాటరీలను అందిస్తున్నాయి. ఈ సామర్థ్యం వల్ల మీ ఫోన్‌నే ఒక పవర్ బ్యాంక్‌లా పని చేస్తుంది. ఇప్పుడు వచ్చే ఫోన్లలో రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. దీని ద్వారా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వైర్ కనెక్ట్ చేయడం ద్వారా పెట్టుకోవచ్చు. లేదా వైర్ లెస్ విధానం అయినా ఛార్జ్ చేయవచ్చు. రివర్స్ ఛార్జింగ్ ఒక ఫోన్‌లోని పవర్‌ను మరో ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అయితే అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉంటుందనే చెప్పలేం. మీరు ఫోన్ కొనుగోలు చేసేముందు దీనిని పరిశీలించాలి.
ప్రధానంగా రెండు విధానాల ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు.అందులో ఒకటి ఛార్జింగ్ కేబుల్. ఛార్జర్ ద్వారా రెండు ఫోన్లను కనెక్ట్ చేసి పవర్ బదిలీ చేయవచ్చు. ఫోన్ మోడల్, అందులోని టెక్నాలజీని బట్టి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఇక మరో ఆప్షన్ విషయానికొస్తే.. వైర్ లెస్ ఛార్జింగ్. ఈ విధానంలో ఒక ఫోన్‌లోని బ్యాటరీ శక్తిని మరో ఫోన్‌లోకి బదిలీ చేయడం. పెద్ద బ్యాటరీలు ఉన్న ఫోన్లలో ఈ ఫీచర్ ఉంది. మీరు కేబుల్ లేకుండా ఛార్జ్ చేయాలంటే ఎదుటివారి ఫోన్‌లో కూడా వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైర్ లెస్ ఫర్ షేర్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత రెండో ఫోన్‌ను మొదటి ఫోన్ వెనుక భాగంలో ఉంచాలి. రెండు స్మార్ట్‌ఫోన్లు వెనుక ప్యానెల్‌లు ఒకదానికొకటి సరిగ్గా అతుక్కుని ఉంటే ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ స్లాట్‌లు ఎదురుగా ఉండాలి.