Transparent Bandage: మనకు గాయాలు తగిలితే కట్టు కడతారు వైద్యులు. తెల్లని గాజు గుడ్డ.. దూది ఉపయోగించి కట్టే ఈ కట్టుతో లోపల గాయం మరిస్థితి మనకు అర్ధం కాదు. గాయం ఎలా ఉన్నదీ చూడాలంటె ఆ కట్టు తీసి చూడాలి. మళ్ళీ కొత్త కట్టు కట్టుకోవాలి. అయితే, ఇటువంటి అవసరం లేకుండా కొత్త తరహాలో గాయానికి కట్టవేసే విధానాన్ని కనిపెట్టారు ఐఐటి గౌహతి పరిశోధకులు. దీంతో కట్టు కడితే మన గాయం కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ కట్టు పారదర్శకమైన కట్టు అన్నమాట. అంతే కాదు ఈ కట్టుద్వారా గాయం వేగంగా మానిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు.
దీనిని సింథటిక్ పాలిమర్‌లతో తయారు చేశారు. అదే విధంగా జీవఅధోకరణం చెందుతుంది. అంటే, ఇది పర్యావరణానికి హాని కలిగించదు. ఈ బ్యాండేజ్ చాలా తక్కువ ధరకే లభిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ కట్టు గాయాలను ఎలా నయం చేస్తుంది..
పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం, ఈ కట్టు తేమను పెంచుతుంది. ఈ తేమ శరీరంలో ఉండే ఎంజైమ్‌ల సహాయంతో గాయాలను నయం చేస్తుంది. తత్ఫలితంగా, ఈ కట్టుతో శరీరం స్వయంచాలకంగా గాయాలను నయం చేయడం ప్రారంభిస్తుంది. ఇది ఇతర స్ట్రిప్‌ల కంటే 50 శాతం వరకు తక్కువ ధరలలో లభిస్తుంది.
సాధారణంగా పత్తి ఉన్నితో తయారు చేసిన కట్టు గాయం డ్రెస్సింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. గాయాల లీకేజీని నివారించడానికి, తక్కువ సమయంలో గాయాలను నయం చేయడానికి వీటిని తరచుగా ఉపయోగిస్తారు. అయితే, ఈ పట్టీలను తొలగించేటప్పుడు చాలా సార్లు గాయం మరమ్మత్తు కణజాలం దెబ్బతింటుంది. ఈ సమస్యలను నివారించడానికి పారదర్శక పట్టీలు రూపొందించారు. ఇది గాయాన్ని బయట నుండి చూడడానికి, చికిత్సను సులభతరం చేయడానికి అనుమతిస్తుంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఇతర పట్టీల నుండి గాయాలు కనిపించవు, కానీ కొత్త పారదర్శక కట్టు వేసినప్పుడు బయట నుండి గాయాలు కనిపిస్తాయి. ఇది మెరుగైన చికిత్సకు దారి తీస్తుంది. సింథటిక్ పాలిమర్‌లు మరియు హైడ్రోజెల్‌తో తయారు చేయబడిన ఈ బ్యాండేజ్‌ను కెమికల్ ఇంజనీరింగ్ విభాగం బృందం సంయుక్తంగా తయారు చేసింది. పరిశోధకుడు అరిత్రా దాస్ మాట్లాడుతూ, సింథటిక్ పాలిమర్‌లు, పాలీవినైల్ ఆల్కహాల్ వంటి హైడ్రోజెల్‌లు ఈ కట్టును సిద్ధం చేయడానికి ఉపయోగించారు. ఈ కారణంగా, ఈ కట్టు విషపూరితం కాదు. అలాగే తక్కువ ధరలో లభిస్తుంది.
Weight Loss: బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నారా.? అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త!