ISRO: నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ-సి53 రాకెట్‌.. కొనసాగుతోన్న కౌంట్‌డౌన్‌..

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి PSLV C-53 మిషన్‌ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తులు బుధవారం ప్రారంభించారు...

ISRO: నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ-సి53 రాకెట్‌.. కొనసాగుతోన్న కౌంట్‌డౌన్‌..
Follow us

|

Updated on: Jun 30, 2022 | 8:43 AM

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి PSLV C-53 మిషన్‌ కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తులు బుధవారం ప్రారంభించారు. ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగిన తర్వాత వాహనకౌన నింగిలోకి వెళ్లనుంది. ఇస్రో వాణిణ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఐఎల్‌) చేస్తోన్న రెండో మిషన్‌ ఇది. సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు రాకెట్‌ను నింగిలోకి పంపించనున్నారు. మొత్తం మూడు ఉపగ్రహాలల్లో డీఎస్‌-ఈఓ ఒకటి.. దీని బరువు 365 కిలోలు. మరో ఉపగ్రహం సింగపూర్‌కు చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు.

మూడో ఉపగ్రహం స్కూబ్‌-I నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు కేవలం 2.8 కిలోలే. సింగపూర్‌కు చెందిన న్యూసార్ ఉపగ్రహం సార్‌ పేలోడ్‌ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి అనే తేడాలేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో చిత్రాలను అందించనున్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..