Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో..

|

Dec 05, 2023 | 8:25 PM

చంద్రయాన్ ఇది పేరు కాదు.. భారతదేశపు కీర్తి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే చంద్రయాన్ 3 విజయం. చంద్రునిపై ఉన్న పూర్తి సమాచారాన్ని కనుగొనేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఇందులో కీలక పాత్ర పోషించింది ప్రొపల్షన్ మాడ్యూల్. దీనిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. తన కక్ష్యను మార్చుకొని భూమిపైకి తీసుకొచ్చే సరికొత్త ప్రయోగంపై దృష్టి సారించింది. అసలు దీని ఉపయోగం ఏంటి.. ఇది చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఎలా పని చేసిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో..
Isro Has Focuse On Bringing The Propulsion Module Use In The Chandrayaan 3 Launch To Earth
Follow us on

చంద్రయాన్-3 ఇది పేరు కాదు.. భారతదేశపు కీర్తి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే చంద్రయాన్ 3 విజయం. చంద్రునిపై ఉన్న పూర్తి సమాచారాన్ని కనుగొనేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఇందులో కీలక పాత్ర పోషించింది ప్రొపల్షన్ మాడ్యూల్. దీనిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. తన కక్ష్యను మార్చుకొని భూమిపైకి తీసుకొచ్చే సరికొత్త ప్రయోగంపై దృష్టి సారించింది. అసలు దీని ఉపయోగం ఏంటి.. ఇది చంద్రయాన్-3 ప్రాజెక్టులో ఎలా పని చేసిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రయాన్- 3 విజయానికి ప్రదానంగా దోహదపడనది మూడు భాగాలు. అందులో ఒకటి ల్యాండర్ మాడ్యూల్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్. చంద్రయాన్- 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన భాగాలను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ఈ ప్రయోగం చేపట్టడంతో ప్రాజెక్టులో ముందుగా అనుకున్న దానికంటే కూడా అధిక ఫలితం మన దేశానికి చేకూరనుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ ను ఆపరేట్ చేయడంలో మన శాస్త్రవేత్తలు చాలా తెలివిగా వ్యవహరించడంతో అందులో దాదాపు 100 కిలోల ఇంధనం మిగిలిపోయింది. దీనిని వాడుకొని చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి ఆ పరికరాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై ఉన్న షేప్ పేలోడ్ భూమిపై అనేక పరిశోధనలు చేసేందుకు దోహదపడుతుందని వెల్లడించారు.

ప్రస్తుతం 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న జియో బెల్ట్ లోకి ప్రవేశించి.. దిగువ కక్ష్యలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఇతర ఉపగ్రహాలను ఢీ కొట్టకుండా ఉండేందుకు అక్టోబర్ నెలలోనే ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. చంద్రమండలంపైకి వెళ్లే సమయంలో ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ తో ల్యాండర్ మాడ్యూల్ అనుసంధానమై పనిచేస్తుంది. జాబిల్లికి 100 కిలో మీటర్ల దూరం వరకూ ల్యాండర్ మాడ్యూల్ ను సురక్షితంగా తీసుకెళ్లి ఆ తరువాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. అలా విడిపోయిన సమయంలో కింద పడిపోకుండా కొన్ని నెలల పాటూ నిర్ధేశించిన కక్ష్యలోనే తిరుగుతూ ఉందని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనిని ఇప్పుడు తిరిగి అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి తీసుకొచ్చేలా శ్రమిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..