Smart Phone: మీరు ఆన్‌లైన్‌లో కొన్న ఫోన్‌ ఒరిజినలేనా..? తెలుకోకపోతే బకరా అవుతారంతే..!

|

Oct 04, 2024 | 8:45 PM

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్‌ మొదలైంది. ఈ పండుగ సీజన్‌లో వివిధ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. చాలా వరకు ఆన్‌లైన్‌ సైట్స్‌ స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.అలాగే ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా ఆన్‌లైన్‌ సైట్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఆన్‌లైన్‌లో వచ్చే ఫోన్‌ ఒరిజనలేనా?అనే అనుమానం చాలా వరకు ఉంటుంది.

Smart Phone: మీరు ఆన్‌లైన్‌లో కొన్న ఫోన్‌ ఒరిజినలేనా..? తెలుకోకపోతే బకరా అవుతారంతే..!
Follow us on

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్‌ మొదలైంది. ఈ పండుగ సీజన్‌లో వివిధ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. చాలా వరకు ఆన్‌లైన్‌ సైట్స్‌ స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.అలాగే ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా ఆన్‌లైన్‌ సైట్స్‌నే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకు ఆన్‌లైన్‌లో వచ్చే ఫోన్‌ ఒరిజనలేనా?అనే అనుమానం చాలా వరకు ఉంటుంది. అలాగే ఆన్‌లైన్‌ సేల్స్‌లో చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్లపై 50 నుంచి 70 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో చాలా సార్లు కస్టమర్లు మోసానికి గురవుతున్నారు. అయితే ఇటీవల పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఫోన్‌ డెలివరీ అయ్యాక చిన్న టిప్స్‌ పాటిస్తే మనకు డెలివరీ అయిన ఫోన్‌ ఒరిజినలో? కాదో? తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ డెలివరీ అయ్యాక పాటించాల్సిన టిప్స్‌ను ఓ సారి తెలుసుకుందాం.

టెలికాం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్

  • స్మార్ట్‌ఫోన్ అసలైనదా? కాదా? అనేది టెలికాం డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ నుండి తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు సీఈఆర్‌ఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • హోమ్ పేజీలో మీరు సీఈఐఆర్‌ సర్వీస్‌పై క్లిక్ చేసి, ఐఎంఈఐ సర్వీస్‌ను ఎంచుకోవాలి.
  • దీని తర్వాత మీరు మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి ఓటీపీను ఎంటర్‌ చేయాలి.
  • ఓటీపీ నమోదు చేసిన అనంతరం మొబైల్ ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేయాలి.
  • మీరు నమోదు చేసిన ఐఎంఈఐ నంబర్ బ్లాక్ అయ్యి ఉంటే లేదా చెల్లనిది అయితే మీ ఫోన్ నకిలీదని అర్థం

ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుసుకోవడం ఇలా

ఫోన్ ఫేక్ లేదా నిజమా అనేది మీ మొబైల్‌ నుంచి మెసేజ్‌ పంపి కూడా తెలుసుకోవచ్చు.దీని కోసం మీరు కేవైఎం స్పేస్ ఐఎంఈఐ నంబర్‌ను  ఎంటర్‌ చేసి 14422 మెసేజ్‌ చేయాలి. మెసేజ్‌ చేసిన అనంతరం ఐఎంఈఐ ఈజ్‌ వ్యాలీడ్‌ అని రిప్లయ్‌ మెసేజ్‌ వస్తే మీ ఫోన్ నిజమైనదే.

యాప్ ద్వారా తనిఖీ ఇలా

మీ స్మార్ట్‌ ఫోన్‌లో నో యువర్ మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాప్‌లో మీరు 15 అంకెల ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ యాప్‌లో ఫోన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తే, ఆ ఫోన్ అసలైనదని అర్థం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..