హుందాయ్ ఎలక్ట్రిక్ కారు ‘కోనా’ విడుదల.. ప్రత్యేకతలివే

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హుందాయ్ మొదటిసారి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును విడుదల చేసింది. కోనా పేరుతో భారత మార్కెట్‌లోకి ఈ కారును లాంచ్ చేసింది. గ్రీన్ ఫ్యూచర్‌తో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలనే తమ నిబద్ధతతో పాటు ప్రతి వినియోగదారుడకి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ తెలిపారు. ఐదు సీటర్ల సిస్టమ్‌ గల ఈ కారు ధరను […]

హుందాయ్ ఎలక్ట్రిక్ కారు ‘కోనా’ విడుదల.. ప్రత్యేకతలివే
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 10, 2019 | 4:54 PM

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హుందాయ్ మొదటిసారి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును విడుదల చేసింది. కోనా పేరుతో భారత మార్కెట్‌లోకి ఈ కారును లాంచ్ చేసింది. గ్రీన్ ఫ్యూచర్‌తో పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయాలనే తమ నిబద్ధతతో పాటు ప్రతి వినియోగదారుడకి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ తెలిపారు. ఐదు సీటర్ల సిస్టమ్‌ గల ఈ కారు ధరను రూ.25.3లక్షలుగా సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం దీనికి అమర్చిన బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452కి.మీలు ప్రయాణించవచ్చు. గంట సమయంలో ఈ కారు 80శాతం ఛార్జింగ్ అవుతుంది. ఇక ఈ కారును కొనుగోలు చేస్తే ప్రయాణికులకు ఓ పోర్టబుల్ ఛార్జర్, ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్లు ఇస్తారు. ఇక హౌస్పీడ్ ఛార్జింగ్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కంపెనీతో హుందాయ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి ఎంపిక నగరాలతో పాటు హుందాయ్ స్పెషల్ డీలర్ల వద్ద కూడా ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

కోనా ప్రత్యేకతలు: 7 ఇంచుల డిజిటల్ డ్యాష్ బోర్డు హెడ్ అప్ డిస్‌ప్లే వైర్‌లెస్ ఛార్జింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో లేదాయాపిల్ కార్‌ప్లే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ 6ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ హిల్ స్టార్ట్ అసిస్ట్ రియర్ పార్కింగ్ సెన్సార్, రియర్ కెమెరా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 10సెకన్లలో 100కి.మీ వేగం

కాగా ప్రస్తుతం మార్కెట్లో మహీంద్ర ఇ2ఓ ప్లాస్, ఇ-వెరిటో అనే ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తున్నాయి. ఇక ఎంజీ మోటార్స్, నిస్సార్ కంపెనీలు ఈ ఏడాదిలోనే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుండగా.. మారుతి సుజుకి వచ్చే సంవత్సరం నాటికి ప్లాన్ చేస్తోంది.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు