గేమింగ్ ప్రపంచంలో సంచలనం.. ‘జీటీఏ 6’ (GTA VI) ఫస్ట్ రివ్యూ వచ్చేసింది !

గేమింగ్ ప్రియులు ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6' (GTA VI) విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత ఈ గేమ్ ​కు కొత్త వెర్షన్‌‌‌‌ రావడంతో అభిమానుల్లో భారీ సందడి నెలకొంది. భారత్‌లో కూడా గురువారం (నవంబర్ 19) నుంచి జీటీఏ 6 అందుబాటులోకి వచ్చింది.

గేమింగ్ ప్రపంచంలో సంచలనం.. జీటీఏ 6 (GTA VI) ఫస్ట్ రివ్యూ వచ్చేసింది !
Gta 6 First Review

Updated on: Nov 20, 2026 | 12:23 PM

గేమింగ్ ప్రియులు ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6’ (GTA VI) విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత ఈ గేమ్ ​కు కొత్త వెర్షన్‌‌‌‌ రావడంతో అభిమానుల్లో భారీ సందడి నెలకొంది. భారత్‌లో కూడా గురువారం (నవంబర్ 19) నుంచి జీటీఏ 6 అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో జీటీఏ సిరీస్ చరిత్రలో తొలిసారి మహిళను ప్రధాన పాత్రలో పరిచయం చేశారు. కాగా కొందరు ఉద్యోగులు గేమ్‌‌‌‌ ఆడేందుకు ఏకంగా సెలవులు తీసుకుంటున్నామని సోషల్‌‌‌‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. జీటీఏ​ డెవలపర్​ రాక్‌‌‌‌స్టార్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ అధికారికంగా తయారీ ఖర్చును ఇంకా వెల్లడించకపోయినా.. బడ్జెట్ ​బిలియన్‌‌‌‌ డాలర్లకు (దాదాపు రూ.9,300 కోట్లు)పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా విజువల్స్, గేమ్‌ప్లేతో మ్యాజిక్ చేశారని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

హాలీవుడ్ సినిమాను తలపించే మేకింగ్..

అమెరికాలోని ఫ్లోరిడా తరహాలో రూపొందించిన ‘లియోనిడా’ నగరంలో ఈ కథ సాగుతుంది. ట్రాఫిక్, నేరాలు, అందమైన బీచ్‌లతో నిండిన వైస్ సిటీ అండర్ వరల్డ్‌లో ఇద్దరు చిల్లర దొంగలు ఎలా ఎదిగారన్నదే ఈ గేమ్ స్టోరీ. తొలి కొన్ని గంటల ఆటలో ఆకట్టుకున్న పలు ప్రధాన అంశాలను ఏఎఫ్‌పీ చెప్పుకొచ్చింది. గేమ్ మొదలైన క్షణం నుంచే ఒక భారీ హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుందని.. ప్రధాన పాత్రధారులైన జేసన్, లూసియాల ఎంట్రీ సీన్ టైటిల్ కార్డ్స్ పడినట్లుగానే నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలిపింది. యాక్షన్ సన్నివేశాలు, కాల్పులు, కార్ల ప్రమాదాల సమయంలో వచ్చే స్లో మోషన్ ఎఫెక్ట్స్, కెమెరా యాంగిల్స్ చూస్తుంటే ఒక బ్లాక్‌బస్టర్ మూవీ చూస్తున్నట్లే ఉంటుందని రియాక్ట్ అయ్యింది.

కాగా ఆట ప్రారంభంలో జేసన్, లూసియాల మధ్య బంధం ఎలా బలపడిందో చూపించినట్టు తెలిపింది. పోలీసుల తనిఖీల్లో అనుకోకుండా కలిసిన వీరిద్దరూ, ఆ తర్వాత ఒక దోపిడీ విఫలమై లూసియా జైలు పాలయ్యే వరకు సాగే కథను సుదీర్ఘమైన సినిమాటిక్ కట్-సీన్ల ద్వారా చూపించారని రాసుకొచ్చింది. ఆ తర్వాతే ఆట అసలు మలుపు తిరుగుతుందని.. మాజీ సైనికుడైన జేసన్ స్థానిక గ్యాంగ్‌స్టర్ల వద్ద చిన్నచిన్న పనులు చేస్తూ, సముద్రంలో పడేసిన డ్రగ్ ప్యాకెట్లను వెతకడం, కార్లు దొంగిలించడం, అప్పులు వసూలు చేయడం వంటి పనులతో గేమ్ ప్లేజర్ చేతికి వస్తుందని రివీల్ చేసింది.

కళ్లు చెదిరే గ్రాఫిక్స్..

ఇక రాక్‌స్టార్ గేమ్స్ ఎప్పుడూ గ్రాఫిక్స్ విషయంలో రాజీపడదని అందరికీ తెలిసిందే. ఈసారి ఆ స్థాయిని మరింత పెంచుతూ పాత్రలను మరింత సహజంగా రూపుదిద్దిందని కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా రద్దీగా ఉండే వీధులు, నియాన్ లైట్ల వెలుగులో మెరిసిపోయే నైట్ లైఫ్, స్వచ్ఛమైన బీచ్‌లతో ‘లియోనిడా’ నగరం నిజమైన ప్రపంచాన్ని తలపిస్తుందని.. సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తూ నీటి అడుగు ప్రపంచాన్ని కూడా చూడొచ్చంది. ఇప్పటివరకు వచ్చిన గేమ్స్ అన్నింటికంటే ఇందులోని మ్యాప్ చాలా పెద్దదని.. గేమర్ ప్రమేయం లేకపోయినా నగరంలోని ఇతర పాత్రలు తమ పనుల్లో తాము నిమగ్నమై ఉంటాయని చెప్పింది. మనం కారులో వెళ్తుంటే దారిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, బీచ్ పక్కన దోపిడీలు వంటివి సహజంగా కళ్లముందు జరుగుతూ కనిపిస్తాయని ప్రస్తావించింది.

Gta 6 First Review (1)

కొత్త సవాళ్లు..

అయితే ఈసారి జీటీఏ ఆటగాళ్లకు మరిన్ని సవాళ్లను విసురుతోందని డ్రైవింగ్ మునుపటి కంటే కష్టంగా ఉంటుందని తెలియజేసింది. అంతేకాకుండా కారులో ఫ్యూయెల్ ఎంత ఉందో ఎప్పటికప్పుడు చూసుకోవాలని.. కారు డిక్కీలో ఏం ఉంచాలి, వెంట ఏం తీసుకెళ్లాలి అనేది మనమే నిర్ణయించుకోవాలంది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో పాటు టార్గెట్లను గుర్తించడానికి ప్రత్యేక యాప్‌లను వాడాల్సి ఉంటుందని వివరించింది. కానీ ఎన్ని కొత్త మార్పులు చేసినా, పాత జీటీఏ అభిమానులకు కావాల్సిన అసలైన మజాను మాత్రం రాక్‌స్టార్ మిస్ చేయలేదని తెలిపింది. మిషన్ల కోసం డ్రైవింగ్ చేయడం, గొడవలు పెట్టుకోవడం, డబ్బు సంపాదించడం వంటివి యథావిధిగా ఉన్నాయని.. జేసన్, లూసియాల మధ్య జరిగే సరదా సంభాషణలు.. సహాయక పాత్రల ద్వారా జీటీఏ మార్క్ కామెడీని అలానే ఉంచిందని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చింది.

క్రైమ్ పాడ్‌కాస్ట్‌ల సందడి..

మరోవైపు పాత గేమ్స్ తరహాలోనే ఇందులో కూడా ఇంట్లో ఉన్నా, కారులో ప్రయాణిస్తున్నా 20కి పైగా రేడియో స్టేషన్లను వినవచ్చట. సింపుల్ మైండ్స్, డాఫ్ట్ పంక్, వాన్ హాలెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల సంగీతం అలరిస్తుందని.. వీటికి తోడు ఈసారి కొత్తగా ‘పాడ్‌కాస్ట్‌లను’ కూడా జతచేశారంది. ముఖ్యంగా వైస్ సిటీలో జరిగే నేరాలపై సాగే ‘ట్రూ-క్రైమ్’ పాడ్‌కాస్ట్ సిరీస్ ఆటగాళ్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని తమ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us