G Shock Mudman Watch: షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్.. బిల్డ్ క్వాలిటీ చూస్తే మతిపోతుందంతే..!

|

Apr 20, 2024 | 4:30 PM

యువత స్మార్ట్ వాచ్‌లను వాడకాన్ని ఇష్టపడడంతో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లను అన్ని కంపెనీలు సరసమైన ధరల్లో రిలీజ్ చేస్తుండగా మరికొన్ని కంపెనీలు షాకింగ్ ధరల్లో స్టన్నింగ్ ఫీచర్స్‌తో వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీలు అయిన టొయోటా, కాసియో కలిసి ఒక కొత్త వాచ్‌ను రిలీజ్ చేశాయి. ఈ వాచ్‌ను జీ-షాక్ మడ్ మ్యాన్ జీడబ్ల్యూ-9500 టీఎల్‌సీ వెర్షన్‌లో లాంచ్ చేశారు. 

G Shock Mudman Watch: షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్.. బిల్డ్ క్వాలిటీ చూస్తే మతిపోతుందంతే..!
G Shock Mudman
Follow us on

ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా యువత స్మార్ట్ వాచ్‌లను వాడకాన్ని ఇష్టపడడంతో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్‌లను అన్ని కంపెనీలు సరసమైన ధరల్లో రిలీజ్ చేస్తుండగా మరికొన్ని కంపెనీలు షాకింగ్ ధరల్లో స్టన్నింగ్ ఫీచర్స్‌తో వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ కంపెనీలు అయిన టొయోటా, కాసియో కలిసి ఒక కొత్త వాచ్‌ను రిలీజ్ చేశాయి. ఈ వాచ్‌ను జీ-షాక్ మడ్ మ్యాన్ జీడబ్ల్యూ-9500 టీఎల్‌సీ వెర్షన్‌లో లాంచ్ చేశారు.  ఈ వాచ్ దేశవ్యాప్తంగా ఉన్న క్యాసియో స్టోర్లలో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఆన్‌లైన్‌లో క్యాసియో ఇండియా వెబ్సైట్లో రూ. 24,995 ధరకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ వాచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

క్యాసియో నుంచి జీ- షాక్ వాచ్ సిరీస్ కఠినమైన వాచ్‌గా ప్రసిద్ధి చెందింది. కంపెనీ ఈ వాచ్‌ను కొత్త మడ్మాన్ సిరీస్ వాచ్‌తో తదుపరి స్థాయికి తీసుకువెళుతోంది. ఈ వాచ్ అత్యంత కఠినమైన వాహనాల్లో ఒకటైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొంది రూపొందించారు. ఈ వాచ్ క్యాసియో నుంచి ముడ్ మ్యాన్ సిరీస్‌లోని మూడో తరం వాచ్. ఈ వాచ్ ఎడిషన్ ‘కార్బన్ కోర్ గార్డ్’ నిర్మాణాన్ని పొందింది ఇది విపరీతమైన దుమ్ము, మట్టి మరియు ఇతర భూసంబంధమైన అంశాలను తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. 

ఈ మడ్ వ్యాన్ వాచ్ లక్షణాలు టయోటా ల్యాండ్ క్రూయిజర్‌కు సంబంధించిన దృఢత్వం, స్థితిస్థాపకతను పోలి ఉంటాయి. ఇది లెక్కలేనన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత సవాలుగా ఉన్న కార్ ర్యాలీ, డాక్టర్ ర్యాలీలో కఠినమైన పరిస్థితులను భరించిందని పేర్కొంది. ఈ వాచ్ నీలం, తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వస్తుంది. ఈ వాచ్‌కు సంబంధించిన బ్యాండ్, కేస్ బ్యాక్ కూడా టీఎల్‌సీ బ్రాండ్ లోగోతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి