
Electric Cars: మనం షియోమి గురించి ఆలోచించినప్పుడు, మనలో చాలా మందికి ఫోన్ గుర్తుకు వస్తుంది. అయితే, ఈ కంపెనీ కేవలం ఫోన్‌లనే కాకుండా, అనేక ఇతర ఉత్పత్తులను కూడా విక్రయిస్తుంది. అటువంటి విభాగాలలో ఒకటి షియోమి కార్లు. షియోమి చైనా మార్కెట్‌లో అనేక కార్లను విక్రయిస్తుంది. ఇటీవల, ఈ కంపెనీ తన స్కైనోమాడ్ ఉత్పత్తిని పరిచయం చేసింది.
కంపెనీ తన Xiaomi SkyNomad సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ శ్రేణిలో అధిక-శ్రేణి ఎలక్ట్రిక్ వాహన విభాగంలో నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఇది Skynomad N70 , N90 అనే పేర్లతో నాలుగు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. కంపెనీ N70 ప్రో, N70 మ్యాక్స్, N90 మ్యాక్స్, N90 మ్యాక్స్ స్టూడియోలను విడుదల చేసింది. షియోమి స్కైనోమాడ్ N70 ఒక 5-సీటర్ కారు కాగా, N90 ఒక 7-సీటర్ SUV. వాటి ముఖ్య లక్షణాలను పరిశీలిద్దాం.
ఈ రెండు SUVలలోనూ వాటి రేంజ్-ఎక్స్‌టెండర్ వేరియంట్ ప్రధాన ఆకర్షణ. ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్ మోడల్ అయిన N70 ప్రో గురించి తెలుసుకుందాం. ఈ కారులో 52kWh బ్యాటరీ ఉంది. దీని ఎలక్ట్రిక్ రేంజ్ 351 కిలోమీటర్లుగా పేర్కొంది. ఇంజిన్, ఎలక్ట్రిక్ వేరియంట్ రెండింటి సంయుక్త రేంజ్ 1351 కిలోమీటర్లు. దీని N70 మాక్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్లతో వస్తుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ కారు 76kWh బ్యాటరీతో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోడ్‌లో దీని రేంజ్ 505 కిలోమీటర్లుగా పేర్కొంది. దీని సంయుక్త రేంజ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) 1461 కిలోమీటర్లు.
Xiaomi SkyNomad N90 Maxలో డ్యూయల్ మోటార్లు, ఆల్-వీల్ డ్రైవ్ ఉన్నాయి. ఇది 76kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 464 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రేంజ్‌ను అందిస్తుందని తెలిపింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలకు కలిపి క్లెయిమ్ చేసిన రేంజ్ 1705 కిలోమీటర్లు. ఈ SUV గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. మాక్స్ స్టూడియో వేరియంట్‌లో ఎలక్ట్రిక్ పాప్-అప్ రూఫ్ మాడ్యూల్ ఉంటుంది. ఇది కారు ఎత్తును 2294 మిమీలకు పెంచుతుంది. రెండవ వరుస సీట్లను 30 సెకన్లలో బెడ్‌గా మార్చవచ్చు. ఈ మొత్తం యంత్రాంగం విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ అండర్‌ఫ్లోర్ హీటింగ్, వుడ్-గ్రెయిన్ అల్యూమినియం ఫ్లోరింగ్, 30-అంగుళాల ప్రొజెక్షన్ స్క్రీన్ కూడా ఉన్నాయి.
స్కైనోమాడ్ N90 మాక్స్ 5.285 మీటర్ల పొడవు, 1.998 మీటర్ల వెడల్పును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 3.080 మీటర్లు. ఇది 2+2+3 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. స్కైనోమాడ్ N70 4.96 మీటర్ల పొడవు, 1.998 మీటర్ల వెడల్పును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2.950 మీటర్లు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి