Poco C85x 5G: బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ అంటే ఇదే.. ఫీచర్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అది కూడా రూ.10వేల బడ్జెట్‌లోపు కావాలా.. అయితే కచ్చితంగా మీరు ఈ ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే.. జస్ట్ రూ.10వేలకే ఈ ఫోన్‌లో మీరు 6300mAh బ్యాటరీ బ్యాకప్.. మరెన్నే అద్భుతమైన ఫీచర్స్‌ పొందవచ్చు.. మరీ ఆ ఫోన్ ఏది.. దాని మరిని ఫీచర్స్ ఇక్కడ తెలుసుకుందాం.

Poco C85x 5G: బడ్జెట్‌లో బెస్ట్ ఫోన్ అంటే ఇదే.. ఫీచర్స్ చూస్తే పిచ్చెక్కాల్సిందే!
Best Budget Mobiles

Updated on: Sep 27, 2026 | 9:24 PM

వినియోగదారుల అభిరుచులకు తగ్గటూ మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటాయి. అయితే అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఫోన్స్ అన్నీ చాలా వరకు ఎక్కవ ధరను కలిగి ఉంటాయి. కానీ రీసెంట్‌గా POCO నుంచి వచ్చిన c85 5G స్మార్ట్‌ఫోన్‌ మాత్రం.. మీకు తక్కువ ధరలో అందుబాటులోకి ఉంది. ఎక్కువ బ్యాటరీ, రెగ్యులర్ యూజ్ కోసం.. బడ్జెట్‌లో ఫోన్ కావాలి అనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

గత మార్చిలో లాంచ్ అయిన POCO c85 5G ఫోన్ ఇప్పటికీ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో మీకు లభిస్తోంది. పోకో కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. లాంచ్ సమయంలో దీని ప్రారంభ ధర రూ. 10,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.10వేలకు అందుబాటులో ఉంది. ఈ బడ్జెట్‌లో 5G కనెక్టివిటీ, 6300mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 32MP కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లు అందించే ఏకైక ఫోన్ అదే అంటున్నారు నిపుణులు.

ఈ ఫోన్‌లో మీకు రెండు వేరియంట్లో అందుబాటులో ఉంది. ఒకటి 4GB RAM + 64GB స్టోరేజ్.. ఈ మోడల్ ధర రూ. 10,999 కాగా.. 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,999గా ఉంది. అలాగే ఈ ఫోన్ మొత్తం బ్లాక్, గోల్డ్, గ్రీన్ మూడు కలర్స్‌లో మార్కెట్లో లభిస్తుంది. మీ అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలో దాన్ని కొనుగోలు చేయవచ్చు.

POCO c85 5G ఫీచర్స్

ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 6.9 ఇంచెస్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెగ్యులర్‌వాడే వారికి ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీని డిస్‌ప్లే రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు ఉంటుంది. సినిమాలు చూసేందుకు కూడా ఈ డిస్‌ప్లే చాలా బాగా ఉంటుంది.

6300mAh బ్యాటరీ:

ఇక ఈ ఫోన్‌లో ప్లస్ పాయింట్ ఏమిటంటే.. దీని బ్యాటరీ.. ఇందులోని ఏకంగా 6300mAh బ్యాటరీ తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే.. నార్మల్‌గా వాడేవారికి రెండ్రోజుల వరకు వస్తోంది. అంతేకాదు దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా తీసుకొచ్చారు. ఈ బడ్జెట్‌లో ఈ ఫీచర్స్ అంటే అద్భుతమనే చెప్పాలి.

32MP కెమెరా, 5G ప్రాసెసర్:

ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 32MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ Unisoc T8300 ప్రాసెసర్‌ పై రన్ అవుతుంది. అలాగే IP52 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type-C పోర్ట్ ఇందులో ఉన్నాయి. దీని బరువు కూడా జట్ట్ 210 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. మొత్తం బడ్జెట్‌లో మంచి ఫోన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us