Amazon Freedom Sale: స్మార్ట్ వాచ్‌లపై ఏకంగా 82శాతం వరకూ తగ్గింపు.. అన్నీ టాప్ బ్రాండ్లే.. మిస్ అవ్వొద్దు..
స్మార్ట్ వాచ్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్ వాచ్ లను సొంతం చేసుకునే అరుదైన అవకాశం మీ ముందుకు వచ్చింది. దేశంలో ఉన్నఅన్ని టాప్ బ్రాండ్లపైనా అదిరే ఆఫర్లు అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఇటీవల ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో స్మార్ట్ వాచ్ లో ఏకంగా 82శాతం వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి..

స్మార్ట్ వాచ్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరకే బెస్ట్ బ్రాండ్ వాచ్ లను సొంతం చేసుకునే అరుదైన అవకాశం మీ ముందుకు వచ్చింది. దేశంలో ఉన్నఅన్ని టాప్ బ్రాండ్లపైనా అదిరే ఆఫర్లు అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఇటీవల ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో స్మార్ట్ వాచ్ లో ఏకంగా 82శాతం వరకూ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వాటిల్లో పలు టాప్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఆ స్మార్ట్ వాచ్ లు ఏంటి? వాటిపై ఆఫర్లేంటి చూద్దాం రండి..
క్రాస్ బీట్స్ ఆర్బిట్ ఇన్ఫినిటీ 2.0.. ఈ స్మార్ట్ వాచ్ పై 67శాతం తగ్గింపుతో అమెజాన్ సేల్ లో లభిస్తోంది. దీనిలో స్టైలిష్ సూపర్ రెటీనా అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. బ్రౌన్ కలర్ బెల్ట్ తో వచ్చే ఈ వాచ్ డిజైన్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంటుంది. 1.43 అంగుళాల స్క్రీన్ పరిమాణంతో వస్తుంది, 4జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. 1000ప్లస్ పాటలు స్టోర్ చేసుకోవచ్చు. క్రాస్‌బీట్స్ ఆర్బిట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,997 గా ఉంది.
నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట్ వాచ్ పై ఏకంగా 50శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 1.96 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే వస్తుంది. కేవలం రెండు గంటల ఛార్జింగ్‌తో ఏడు రోజుల బ్యాటరీ జీవితం కలిగి ఉంటుంది. అధునాతన బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. దీని ధర ధర రూ. 4,497 గా ఉంది. రూ. 216 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉ న్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 500 వరకూ తగ్గింపు పొందుతారు.




స్మార్ట్‌వాచ్‌లో బోట్.. ఈ వాచ్ 1.83-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే లైవ్ క్రికెట్ స్కోర్ అప్ డేట్లు వస్తాయి. 700పైగా యాక్టివ్ మోడ్లు ఉంటాయి. అధునాతన బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది.దీనిపై మీరు 81% తగ్గింపు తగ్గింపు పొందుతారు. కేవలం రూ. 1,297 కే కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై అదనంగా రూ. 500 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట వాచ్ 4.6 సెంటీమీటర్ స్క్రీన్‌తో వస్తుంది. దీనిలో 90 ప్లస్ వ్యాయామ ట్రాకింగ్ ఆప్షన్లు ఉంటాయి. వేర్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిపై 68శాతం తగ్గింపు పొందుతారు. రూ 13,899 లకు దీనిని కొనుగోలు చేయొచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.667 నుంచి సులభవాయిదాలలో చెల్లించొచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై కొనుగోలు చేస్తే రూ. 1,389.90 డిస్కౌంట్ లభిస్తుంది.
బీట్‌ఎక్స్‌పి స్మార్ట్ వాచ్.. ఈ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల రౌండ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. బ్లూ టూత్ కాలింగ్, రియల్ టైమ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉంటాయి. ఇది అమెజాన్ లో 82% తగ్గింపుతో లభిస్తుంది. దీని ధర రూ. 1,997 గా ఉంది. దీనిలో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..