పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో డిస్నీ+ హాట్ స్టార్ కీలక నిర్ణయం.? వచ్చే నెల నుంచే..
దీంతో పాస్ట్ వర్డ్ షేరింగ్ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మరో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ+ హాట్‌స్టార్ కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌కు అదనంగా ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో...

మార్కెట్లోకి నెలకొన్న పోటీ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో పలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విషయంలో కఠిన నిబంధనను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవాలంటే అదనంగా చెల్లించాలనే విధానాన్ని తీసుకొచ్చింది.
దీంతో పాస్ట్ వర్డ్ షేరింగ్ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మరో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే డిస్నీ+ హాట్‌స్టార్ కూడా పాస్‌వర్డ్ షేరింగ్‌కు అదనంగా ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పాస్‌వర్డ్ షేరింగ్ కోసం ప్రత్యేకంగా కంపెనీ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై తాజాగా డిస్నీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హ్యూ జాన్స్టన్ డిస్నీ ప్లస్‌కు సంబంధించి పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించడానికి కొత్త ప్రయత్నం చేశారు. వేరొకరి ఖాతా నుంచి ఎవరైనా లాగిన్ అయితే, వారి స్వంత చందా కోసం సైన్అప్ అక్కడ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. దీని కోసం మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. మార్చి 2024 నుంచి డిస్నీ ఈ విధన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.
పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాలని డిస్నీ యోచిస్తోంది. దీని కోసం, కొత్త సదుపాయం ప్రవేశపెడుతోంది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఫీచర్‌ల మాదిరిగానే ఉండవచ్చని తెలుస్తోంది. నెట్‌ఫ్లెక్స్ ప్రస్తుతం పాస్‌వర్డ్ షేరింగ్ కోసం 7.99 డాలర్లను వసూలు చేస్తోంది. అయితే డిస్నీ ఇందుకోసం ఎంత వసూలు చేస్తుందన్న దానిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే అమెజాన్ ఇప్పటికే వీడియోల మధ్య యాడ్స్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి డిస్నీ+ హాట్ స్టార్ సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..