ఐఫోన్ 15 ప్లస్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద తగ్గింపులతో లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 ఉండగా ఇప్పుడు దీని ధర రూ.11,901 తగ్గింపుతో రూ.67,999కి తగ్గింది. ఆపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుండి ఇఎంఐపై ఐఫోన్ 15 ప్లస్‌ను కొనుగోలు చేస్తే, మీరు రూ. 3,500 ప్రత్యేక తగ్గింపును పొందుతారు. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.64,499కు వస్తుంది. అలాగే మీ పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే రూ.42,490 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ పోన్ ఇంచు మించు రూ.22 వేలకే పొందవచ్చు.
ఐఫోన్ 15తో పోలిస్తే ఐఫోన్ 15 ప్లస్ అనేక అదనపు ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఐ ఫోన్ 15 ప్లస్ 6.7 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఇది కంటెంట్ విజువల్స్‌ను మెరుగుపరుస్తుంది. తమ ఫోన్‌లలో స్ట్రీమింగ్ లేదా బ్రౌజింగ్‌లో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులకు ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ ఫోన్ ఏ 16 బయోనిక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో వస్తుంది. 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీ ప్రియులకు కూడా ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ సెకండరీ కెమెరా ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
ఐఓఎస్ 17లో నడుస్తున్న ఈ ఫోన్‌లో వైఫై 802.11, జీపీఎస్, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 5జీ వంటి సరికొత్త కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్‌తో వస్తుంది. ఐఫోన్ 15 ప్లస్ అనేక రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నలుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, పసుపు రంగుల్లో వినియోగదారులు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 201 గ్రాములుగా ఉంది. పెద్ద స్క్రీన్‌లను ఇష్టపడే వినియోగదారులకు సౌకర్యవంతమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి