సఫారీల ఖేల్ ఖతం… క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా!

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలు ఓటమి అంచులో ఎదురీదుతున్నారు. సఫారీలపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయానికి కసరత్తు దాదాపు పూర్తి అయింది. మరో 2 వికెట్లు దక్కితే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌. రోహిత్‌ ద్విశతకం, రహానె శతకంతో భారత్‌ భారీ స్కోరు చేస్తే.. ఉమేశ్‌, షమి, అశ్విన్‌, జడ్డూ, నదీమ్‌ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజు 16 వికెట్లు చేజార్చుకుంది. అంపైర్లు రెండు ఓవర్లు పొడగించినప్పటికీ కోహ్లీసేన […]

సఫారీల ఖేల్ ఖతం... క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా!
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 7:06 PM

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలు ఓటమి అంచులో ఎదురీదుతున్నారు. సఫారీలపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయానికి కసరత్తు దాదాపు పూర్తి అయింది. మరో 2 వికెట్లు దక్కితే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌. రోహిత్‌ ద్విశతకం, రహానె శతకంతో భారత్‌ భారీ స్కోరు చేస్తే.. ఉమేశ్‌, షమి, అశ్విన్‌, జడ్డూ, నదీమ్‌ బంతితో విజృంభించడంతో దక్షిణాఫ్రికా ఒకే రోజు 16 వికెట్లు చేజార్చుకుంది. అంపైర్లు రెండు ఓవర్లు పొడగించినప్పటికీ కోహ్లీసేన ట్రోఫీ అందుకోవడం చూడాలంటే మరొక్క రోజు ఆగాల్సిందే.

మూడోరోజు, సోమవారం 9/2తో ఆట ఆరంభించిన సఫారీలకు డుప్లెసిస్‌ (1)ని ఔట్‌ చేసి ఉమేశ్‌ షాకిచ్చాడు. ఈ క్రమంలో జుబెయిర్‌ హంజ (62; 79 బంతుల్లో 10×4, 1×6) అర్ధశతకంతో ఆడుకున్నాడు. తెంబా బవుమా (32; 72 బంతుల్లో 5×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 91 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. క్రీజులో పాతుకుపోయిన వీరు వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరడంతో ప్రత్యర్థి జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. జడ్డూ వేసిన 27.4వ బంతికి హంజ బౌల్డ్‌ అవ్వగా నదీమ్‌ వేసిన 28.2వ బంతికి బవుమా స్టంపౌట్‌ అయ్యాడు. క్లాసెన్‌ (6), పీడ్‌ (4), రబాడ (0)ను ఔట్‌ చేసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆఖర్లో అన్రిచ్‌ నోర్జె (4; 55 బంతుల్లో) సహకారంతో కుదురుగా ఆడుతున్న జార్జ్‌ లిండె (37; 81 బంతుల్లో 3×4, 1×6)ను ఉమేశ్‌ ఔట్‌ చేయడంతో 162 వద్ద సఫారీల తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.