జగన్‌ ఢిల్లీ పర్యటనపై సీక్రెట్‌ ఎందుకన్న టీడీపీ.. రాద్దాంతం మానుకోవాలన్న వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు..

జగన్‌ ఢిల్లీ పర్యటనపై సీక్రెట్‌ ఎందుకన్న టీడీపీ.. రాద్దాంతం మానుకోవాలన్న వైసీపీ
Follow us

|

Updated on: Jan 20, 2021 | 6:42 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు జగన్‌. పలు కీలక అంశాల పట్ల చర్చించినట్లు తెలుస్తుంది. అయితే పర్యటన పట్ల అంత సీక్రెట్‌ ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తుంది.

సీఎం జగన్‌ది అధకార పర్యటనా లేక వ్యక్తిగత పర్యటనా అనేది జగనే చెప్పాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. టీవీ9 ఫ్లాష్‌ పాయింట్‌ డిబేట్‌లో ఆయన మట్లాడుతూ జగన్‌ ఢిల్లీ పర్యటన వివరాలు ప్రజలకు వివరించాల్సిందేనని అన్నారు.

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ప్రజల్లో వివిధ అనుమానాలకు తావిస్తుందని కనకమేడల అన్నారు. పర్యటన వివరాలను ఎందుకు బహిర్గం చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

ఇక టీడీపీ ఎంపీ కనకమేడలకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. సీఎం జగన్‌ పర్యటనపై టీడీపీ రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. సీఎం జగన్‌ది అధికారిక పర్యటనే అని తేల్చి చెప్పారు. స్టేట్‌ రీ ఆర్గనైజేషన్‌ విషయంలో అమిత్‌షాతో సీఎం జగన్‌ చర్చించారని ఎంపీ భరత్‌ వివరించారు.

గత 5 ఏళ్లలో అమరావతిని టీడీపీ ఏం అభివృద్ధి చేసిందని భరత్‌ ప్రశ్నించారు. పోలవరం విషయంలో సీఎం జగన్‌ పక్కా క్లారిటీతో ఉన్నారని తెలిపారు. పోలవరం బకాయిలను కేంద్రం వెంటనే విడుదల చేయాలని భరత్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌ ఢిల్లీ పర్యటన పట్ల టీడీపీ రాద్దాంతం చేయడం మానుకోవాలని హితవు పలికారు.